AP: గత YCP ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో రూ.27 కోట్ల విలువైన పనులను ప్రారంభించిన ఆయన.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో రాజీ పడట్లేదని తెలిపారు. అటు జువ్వెలదిన్నె హార్బర్‌ను ప్రైవేట్‌పరం చేస్తున్నామంటూ YCP నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
NRML: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జిల్లాల భూగర్భజలాల స్థితి ప్రాధాన్యత పొందింది. ఆదిలాబాద్‌లో 563.45లో 206.16 వినియోగం, 304.04 మిగులు ఉంది. కుమురంభీంలో 567.91లో 118.95 వినియోగంతో 448.96 మిగిలింది. మంచిర్యాలలో 882.58లో 369.12 వినియోగం, 573.46 మిగులు ఉంది. నిర్మల్‌లో 681.60లో, 255.68 వినియోగంతో 425.92 మిగిలింది. నీటి సంరక్షణ అత్యవసరమని అధికారులు తెలిపారు.
TG: అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతును ధైర్యంగా సాగుబడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తాన్నామని స్పష్టం చేశారు. రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు ఇవాళ శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. 70 లక్షల మంది రైతన్నలకు భరోసా కల్పిస్తున్నామని, తమ పాలనలో రైతే రాజని మరోసారి రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
KRNL: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రేపు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SDPT: ‘రైతు భరోసా పథకం’ కింద ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం తమ లక్ష్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నేటి నుంచి రైతుల ఖాతాల్లో చెల్లింపులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రూ.3,590 కోట్లతో లక్షలాది రైతులకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయ బలోపేతం, రైతు సంక్షేమం ప్రభుత్వ ప్రధాన కట్టుబాటుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
TG: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) టన్నెల్ పనులు పునఃప్రారంభమయ్యాయి. గతేడాది ఫిబ్రవరి 22న టన్నెల్‌లో ప్రమాదం జరగడంతో పనులు నిలిచిపోయాయి. ఆగిపోయిన పనులను అవుట్‌లెట్(దేవరకొండ) వైపు ఫిబ్రవరి 3వ వారంలో, ఇన్‌లెట్(దోమలపెంట) వైపు ఈనెల 20న ప్రారంభించారు. 2027 చివరి నాటికి పనులు పూర్తి చేసి, 2028 జూన్ నాటికి అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
MNCL: జన్నారం మండలంలోని కలమడుగు గ్రామ శివారులో ఉన్న గోదావరి వంతెన సమీపంలోని అత్తమడుగు తరిగిపోని జలసిరిగా పేరు తెచ్చుకుంది. వర్షాకాలంలో వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే వేసవికాలంలో నీటి ప్రవాహం లేక చిన్నపాయగా కనిపిస్తుంది. కానీ నది సమీపంలో ఉన్న అత్తమడుగు ప్రాంతం పూర్తి నీటితో కళకళలాడుతూ తీవ్రమైన ఎండల్లో సైతం జీవాలకు నీటిని అందిస్తుంది.
SKLM: ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది అని ఆమదాలవలస ఎమ్మెల్యే సతీమణి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల అన్నారు. ఆమె బూర్జ మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. ఈ మేరకు స్థానిక నాయకులు కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.1.24 లక్షల చెక్కులను అందజేశారు.
NRPT: మాగనూరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి ఉత్కంఠ నెలకొంది. అనుమానాస్పద కారును పోలీసులు తనిఖీ చేస్తుండగా నిందితుడు తప్పించుకునేందుకు యత్నించాడు. అడ్డుకోబోయిన పోలీసు వాహనాన్ని ఢీకొట్టడంతో కారు ఆగిపోయింది. పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ను తోసేసి చీకట్లో చెట్ల మధ్యగా దూకి పరారయ్యాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని గాలింపు చేపట్టారు.
హాలీవుడ్ నటుడు తిమోతీ చాలమెట్ నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘మార్టీ సుప్రీమ్’ OTT విడుదలకు సిద్ధమైంది. జోష్ సాఫ్డీ దర్శకత్వంలో 1950ల నాటి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 24, 2026 నుంచి ‘Max’ లో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 25న HBOలోనూ ప్రసారమవుతుంది. భారత్‌లో జియో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
ATP: గార్లదిన్నె మండలం కల్లూరులో ఈనెల 27న శ్రీరామనవమి పండుగ సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇసుక మూట బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ..120 కేజీల ఇసుక మూట ఎత్తుకొని 10 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ దూరం వెళ్తారో వారిని విజేతలుగా నిర్ణయిస్తామన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేస్తామన్నారు.
NDL: ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరుగుతున్న 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన గౌతమ్ రజత పతకం సాధించారు. F-41 కేటగిరీ షాట్‌పుట్‌లో ఈ విజయాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికృష్ణ, కార్యదర్శి రమణయ్య తెలిపారు. గౌతమ్ విజయంపై జిల్లాలోని ప్రముఖులు అభినందనలు తెలిపారు.
SRPT: గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం గ్రామ సమీపంలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్జీటీ ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు, ఆయన కుమారుడు జ్ఞానేశ్వర్ గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై నరేష్ బాధితులను వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
సన్‌ఫ్లవర్ గింజలు కేవలం చిరుతిండి మాత్రమే కాదు, ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి అద్భుతమైన వరం. ప్రతిరోజూ గుప్పెడు గింజలను ఆహారంలో చేర్చుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉండే విటమిన్-E, సెలీనియం చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడి సహజమైన మెరుపును ఇస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
TG: HYDలోని BJP కార్యాలయంలో మూసీ పునరుజ్జీవనం-వాస్తవాలు అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు పాల్గొన్నారు. మూసీ పునరుజ్జీవనం పేరిట ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాట్లాడారు. పర్యావరణ ప్రభావాలు, మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య వ్యత్యాసంపై చర్చించారు.