• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సుమ.. నూరేళ్లు కాదు 130 ఏళ్లు బ్రతకాలి: రాజీవ్

ప్రముఖ యాంకర్ సుమ కనకాల పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త, నటుడు రాజీవ్ కనకాల సోషల్ మీడియా వేదికగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. ‘నిండు నూరేళ్లు కాదు.. 120-130ఏళ్ల వరకు మనవళ్లు, మనవరాళ్లతో సంతోషంగా ఉండాలి’ అంటూ భార్యపై తన ప్రేమను చాటుకున్నాడు. 1999లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

March 22, 2026 / 01:33 PM IST

సిద్ధాంత నిబద్ధతే బీజేపీ విజయ రహస్యం: శ్రీవర్ధన్ రెడ్డి

RR: తుర్కయాంజల్‌లో బీజేపీ ఎదుగుదలకు క్రమశిక్షణ, సేవా భావమే మూలమని పార్టీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణలో ఆయన ప్రసంగించారు. అంత్యోదయ భావనతో సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరడమే లక్ష్యమని, కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

March 22, 2026 / 01:32 PM IST

‘నర్సీపట్నంకు మరో రూ.8 కోట్లు మంజూరు’

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం తెలిపారు. గత రెండేళ్లలో రూ.24 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలతో కలిపి 341 పనులు పూర్తయ్యాయని చెప్పారు. తాజాగా VMRDA ద్వారా మరో రూ.8 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. 28 వార్డుల్లో 81 పనులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పుకొచ్చారు.

March 22, 2026 / 01:32 PM IST

‘లైసెన్సుడ్ సర్వేయర్ల కార్యవర్గం ఎన్నిక’

PDPL: జిల్లా లైసెన్సుడు సర్వేయర్స్ అసోసియేషన్ సమావేశాన్ని ఇవాళ పెద్దపల్లిలో నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సాతూరి అనిల్, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల తిరుపతి, ఉపాధ్యక్షులుగా ఎండి జుబీర్, బూర్ల సురేష్, కోశాధికారిగా సాన కుమార్ ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కమిటీకి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

March 22, 2026 / 01:32 PM IST

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: చైర్మన్

HNK: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. హనుమకొండ, ఓ-సిటి, ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్యక్రమంలో చైర్మన్ పాల్గొని స్వయంగా చెత్తను తొలగించారు. ఓరుగల్లు నగరాన్ని పరిశుభ్రత కలిగిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

March 22, 2026 / 01:31 PM IST

రాములోరి కళ్యాణానికి రావాలని మాజీ మంత్రికి ఆహ్వానం

JGL: జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డిని సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యా నగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈనెల 27న జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్య క్రమానికి రావాలని ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.

March 22, 2026 / 01:30 PM IST

బ్యాంకు ఉద్యోగికి ఘనంగా సన్మానం

NRML: బైంసా మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన నిహాల్ కెనరా బ్యాంకులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌గా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా ఎంప్లాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సాయినాథ్, తదితరులు పాల్గొని అభినందించారు. నిహాల్ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

March 22, 2026 / 01:30 PM IST

‘అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి’

ADB: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. ఆదివారం పూటూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జీవిత చరిత్ర నాటికి కార్యక్రమ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జయంతి ఉత్సవాల సందర్భంగా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర నాటికి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

March 22, 2026 / 01:30 PM IST

‘హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’

MNCL: హైదారాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అదిరింపులు, బెదిరింపులకు ప్రజలు భయపడవద్దని కోరారు.

March 22, 2026 / 01:30 PM IST

‘ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్’

VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 22, 2026 / 01:27 PM IST

మోయినాబాద్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తు ముమ్మరం

TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ సప్లయర్ అభిషేక్ సింగ్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు రోహిత్ రెడ్డికి 24 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించారు. పార్టీ జరిగిన రోజు ORR వద్ద రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొన్నట్లు తెలిపారు. అభిషేక్, శరత్ మధ్య జరిగిన లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు.

March 22, 2026 / 01:27 PM IST

మంచినీటి సమస్యను పరిష్కరించాలి: మాజీ ఎమ్మెల్యే

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లిలో గల డబుల్ బెడ్ రూం ఇళ్ళల్లో నెలకొన్న మంచినీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ MLA గండ్ర వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేశారు. మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న గండ్ర ఆదివారం ఇళ్లను సందర్శించారు. కాంగ్రెస్ హయాంలో పనులు సకాలంలో జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

March 22, 2026 / 01:26 PM IST

ఆటిజంతో బాలుడి పోరాటం.. సాయం కోసం ఎదురుచూపులు

SRPT: సూర్యాపేటకు చెందిన నాలుగేళ్ల హయాన్ చంద్ర ‘హైపర్ ఆటిజం’తో పోరాడుతున్నాడు. మెరుగైన చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. దాతలు స్పందించి 8919099899 నంబర్‌కు ఫోన్ చేసి పూర్తి వివరాలతో సహాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

March 22, 2026 / 01:24 PM IST

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: నాయకులు

NRPT: ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి తెలిపారు. కొత్తపల్లి మండలం అల్లిపురం గ్రామంలో నిర్మించిన ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. వార్డు సభ్యులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

March 22, 2026 / 01:21 PM IST

‘ధురంధర్ 2’పై యూట్యూబర్ విమర్శలు

‘ధురంధర్ 2’ చిత్రంపై యూట్యూబర్ ధృవ్ రాఠీ విమర్శలు చేశాడు. దీన్ని పచ్చి ప్రచార చిత్రంగా అభివర్ణిస్తూ.. దర్శకుడు ఆదిత్య ధర్ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించాడు. ఈ సినిమా చూస్తే మెదడు మొద్దుబారిపోతుందని ఎద్దేవా చేశాడు. అయితే, ఈ విమర్శలను లెక్కచేయకుండా ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.

March 22, 2026 / 01:20 PM IST