RR: తుర్కయాంజల్లో బీజేపీ ఎదుగుదలకు క్రమశిక్షణ, సేవా భావమే మూలమని పార్టీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణలో ఆయన ప్రసంగించారు. అంత్యోదయ భావనతో సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరడమే లక్ష్యమని, కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.