• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి’

ADB: రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న ప్రైవేటు, ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలంలోని వాడూరు గ్రామంలో శ్రీకృష్ణ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సిబ్బంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు.

March 22, 2026 / 03:07 PM IST

పెట్రోల్ బంకులో ‘నో స్టాక్’ బోర్డులు

వికారాబాద్: నవాబుపేట మండల కేంద్రంలో ఉన్న రెండు పెట్రోల్ బంకులు ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైపు గ్యాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు పెట్రోల్ బంకులు కూడా బంద్ కావడంతో రాబోవు రోజుల్లో ఏం జరుగుతుందోనని వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

March 22, 2026 / 03:06 PM IST

స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

PDPL: గోదావరిఖని పట్టణ శివారు జనగామ గ్రామంలోని కామాక్షి దేవి, ఏకామ్రేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే గ్రామస్థులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొని హోమం నిర్వహించారు.

March 22, 2026 / 03:06 PM IST

వైద్య పరీక్షలు చేసిన ఎంపీ కావ్య

HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. వరంగల్ ఎంపీ. డా. కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మరోసారి తన వైద్య వృత్తిని స్మరింపజేస్తూ ఈ శిబిరానికి వచ్చిన ప్రజలతో ఆమె నేరుగా మమేకమయ్యారు. వారికి బీపీ చెక్ చేసి, వైద్య రిపోర్టులు పరిశీలించి, మెడిసిన్ అందజేశారు.

March 22, 2026 / 03:05 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ

JN: స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ పొన్నం స్వరూప రాజయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనపూర్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌లో పండ్లు పంపిణీ చేశారు. చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. శ్రీధర్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

March 22, 2026 / 03:05 PM IST

కాంగ్రెస్ నేతకు మాతృవియోగం

MBNR: దేవరకద్ర సీనియర్ కాంగ్రెస్ నేత ఆది హనుమంత్ రెడ్డికి మాతృవియోగం సంభవించింది. అనారోగ్యం కారణంగా ఆయన తల్లి లలితమ్మ ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకుని లలితమ్మ భౌతికకాయానికి పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం హనుమంత్ రెడ్డి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, మనోధైర్యం చెప్పారు.

March 22, 2026 / 03:05 PM IST

పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

SKLM: నరసన్నపేట పట్టణంలోని నెయ్యిల వీధిలో పేకాట శిబిరంపై ఎస్సై గణేష్ ఆదివారం దాడిలు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోనికి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.17 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. పేకాట ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

March 22, 2026 / 03:04 PM IST

రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా..? చెక్ చేసుకోండి

MDCL: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో నూతన రేషన్ కార్డుల మంజూరు, నెంబర్ల అడిషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలో నెంబర్ అడిషన్ జరిగిన కొంతమంది ఇప్పటికీ రేషన్ బియ్యం పొందినట్లు పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు అప్లికేషన్ నెంబర్ సహాయంతో స్థానిక మీసేవ, నెట్ కేంద్రాల్లో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

March 22, 2026 / 03:04 PM IST

గరీబ్ హఠావో.. ఒవైసీ బచావో.. కాంగ్రెస్‌పై బండి విమర్శలు

TG: గరీబ్ హఠావో.. ఒవైసీ బచావో అన్నట్లు కాంగ్రెస్ పాలన ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పేదల కోసం బఫర్ జోన్లు.. ఒవైసీ కోసం కంఫర్ట్ జోన్లు పెట్టారని తెలిపారు. అక్రమ కట్టడంలో చదివే పిల్లల సామాజిక కోణం పేదల బిడ్డల విషయంలో కనిపించలేదా అని నిలదీశారు. పేద కుటుంబాలపై బుల్డోజర్లు మెరుపు వేగంతో కదిలాయని.. సల్కం చెరువు వైపు మాత్రం వెళ్లడం లేదన్నారు.

March 22, 2026 / 03:04 PM IST

DCC ఉపాధ్యక్షుడికి స్వగ్రామంలో ఘన సన్మానం!

WNP: జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సాయి చరణ్ రెడ్డిని ఘనపురం మండలం సల్కలాపూర్ స్వగ్రామంలో సత్కరించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తుల దుర్గయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆయనను శాలువాలతో సన్మానించారు. సాయి చరణ్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామానికి జిల్లా స్థాయి పదవి ఇచ్చిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.

March 22, 2026 / 03:03 PM IST

ప్రధానోపాధ్యాయునికి సన్మానం

SRCL: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజ్ జుపల్లికి చెందిన విక్కుర్తి లక్ష్మీనారాయణ అనే ప్రధానోపాధ్యాయుడిని ఆదివారం స్థానికులు ఘనంగా సత్కరించారు. వేములవాడ అర్బన్ కాలనీ ప్రధానోపాధ్యాయులుగా లక్ష్మీనారాయణ విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాహితి కళా సేవా సమితి ఉత్తమ ఉపాధ్యాయ ఉగాది పురస్కారం అవార్డు అందజేసిన సందర్భంగా గ్రామస్తులు సన్మానించారు.

March 22, 2026 / 03:03 PM IST

కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

JN: తరిగొప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని(KGBV) కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వంటగదిని తనిఖీ చేసిన కలెక్టర్ వంట సామాగ్రి నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతలో ఎటువంటి రాజీ పడకూడదని అధికారులను సూచించారు.

March 22, 2026 / 03:01 PM IST

రేపు వెలుగు కార్యాలయంలో రక్తదాన శిబిరం

ASR: జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ నెల 23న అనంతగిరిలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రభాకరరావు ఆదివారం తెలిపారు. ఈ రక్తదాన శిబిరం అనంతగిరి వెలుగు ఆఫీసులో జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో రక్త నిల్వలను పెంచడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు.

March 22, 2026 / 03:01 PM IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సతీమణికి నివాళులర్పించిన ఎమ్మెల్యే.

BHNG: బొమ్మలరామారం మండలం మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బండ వెంకటేష్ సతీమణి ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందడం పట్ల తీవ్ర విషాదం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మైలారం గ్రామానికి వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

March 22, 2026 / 03:01 PM IST

పోచారం ప్రాజెక్టు నుంచి 234 క్యూసెక్కుల నీటిని విడుదల

KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి పంటల కోసం పలు దశల్లో సాగునీటి విడుదల కొనసాగుతుంది. ఆదివారం యాసంగి పంటల కోసం 234 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, 23 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతుందని, ఎటువంటి ఇన్ ఫ్లో లేదని వెల్లడించారు. ఇప్పటివరకు యాసంగి పంటల కోసం 0.888TMCల నీటిని విడుదల చేయగా, ప్రస్తుత నీటి మట్టం 0.657TMCల నీరు నిల్వ ఉంది.

March 22, 2026 / 03:01 PM IST