• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

E.G: విద్యార్థినిపై అత్యాచారం కేసులో Jr. లెక్చరర్ వేదాల వినయ్‌ మంగళవారం సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు. కేసు వివరాలను కొవ్వూరులో DSP దేవకుమార్ తెలిపారు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఇంటర్ సెకండియర్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ నెల 28న విజయవాడలో లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

February 5, 2025 / 07:24 AM IST

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

KKD: కరపలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి ఓ ఆటో అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీ కొట్టిన ఆటో బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వారికి, ఆటోలో ఉన్నవారికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కరప పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 5, 2025 / 07:09 AM IST

వైసీపీ భూ అక్రమాలపై విచారించండి: MLA చైతన్య

కడప: గత వైసీపీ హాయంలో తన నియోజకవర్గంలో భూ అక్రమాలపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి కోరారు. కడప కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత రెడ్డి దృష్టికి పలు అంశాలను తీసుకుని వచ్చారు. అసైన్డ్ భూములను సైతం ఆక్రమించుకున్నారని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

February 5, 2025 / 06:39 AM IST

‘3 రోజులు మాంసం, మద్యం దుకాణాలు బంద్ చేయాలి’

SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీహరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు గ్రామంలో చికెన్, మటన్ విక్రయాలు చేయవద్దని బజరంగ్ దళ్ మండల నాయకులు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని దాభాలు, వైన్ షాప్‌ల నిర్వాహకులు మూడు రోజుల వరకు విక్రయాలు చేయకుండా తమకు సహకరించాలని కోరారు.

February 5, 2025 / 06:34 AM IST

దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ ఋణాలు

JGL: జిల్లాలోని దివ్యాంగులకు ఉపాధి, పునారావాస పథకంలో భాగంగా జీవనోపాధి పొందుటకు సబ్సిడీ ఋణాలు అందజేస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద బ్యాంకు లింకేజి లేకుండా దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రూ.50,000 ల వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. కావున అర్హులైన దివ్యాంగులు ఈ నెల 8వ తేదీ లోగా దరఖాస్తు చేసు‌కోవాలని అన్నారు.

February 5, 2025 / 05:28 AM IST

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

NZB: ఆర్మూర్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు బాలు మాట్లాడుతూ.. పీఎం మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందరికీ ఆమోదయోగమైన బడ్జెట్‌కు అందజేశారన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ కంచెట్టి గంగాధర్ ఉన్నారు.

February 5, 2025 / 05:14 AM IST

‘అత్యధిక మెజారిటీతో పేరాబత్తులను గెలిపించాలి’

కోనసీమ: రామచంద్రపురం పట్టణం చప్పిడి వారిసావరం, హౌసింగ్ కాలనీలలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచనల మేరకు మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అబ్జర్వర్ కాకినాడ రామారావు MLC అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

February 5, 2025 / 04:26 AM IST

‘హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి’

కోనసీమ: అమలాపురం రూరల్ మండల పరిధిలోని భట్నవిల్లిలో వాహనదారులకు మంగళవారం సాయంత్రం హెల్మెట్ ధారణపై సీఐ ప్రశాంత్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని జాతీయ రహదారి పక్కన నిలిపి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ.. వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నారు.

February 4, 2025 / 07:49 PM IST

ఈనెల 7న జాబ్ మేళా

W.G: పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ పరిశోధన సంస్థ సహ సంచాలకులు శ్రీనివాస్, హైదరాబాద్‌కు చెందిన డిబుల్ అగ్రి సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందన్నారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌లో డిగ్రీ లేదా డిప్లామో చేసిన వారు అర్హులన్నారు.

February 4, 2025 / 07:47 PM IST

పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు తహసీల్దార్ల బదిలీ

PDPL: జిల్లాలో శ్రీరాంపూర్ తహసీల్దార్ MD వకీల్, ఓదెల తహసీల్దార్ యాకన్న, ధర్మారం తహసీల్దార్ అరీఫుద్దీన్లను బదిలీ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టరేట్లో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న జగదీశ్వరరావును శ్రీరాంపూర్‌కు, సునీతను ఓదెల తహసీల్దారుగా అలాగే శ్రీరాంపూర్ తహసీల్దార్ వకీల్‌ను ధర్మారం తహసీల్దారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

February 4, 2025 / 07:24 PM IST

8 కారిడార్లలో రవాణా ఆధారిత అభివృద్ధి

HYD: మహానగరంలో మరిన్ని రవాణా ఆధారిత అభివృద్ధి(TOD) కారిడార్లకు HMDA ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ కారిడార్లలో ప్రత్యేక వ్యాపార, వాణిజ్య జోన్ల కోసం లోకల్ ఏరియా ప్లాన్లకు రూపకల్పన చేసేలా తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కారిడార్లలో రోడ్లకు ఇరువైపులా 500 మీటర్ల వరకు ప్రత్యేక నిబంధనలను వర్తింపజేయనున్నారు.

February 4, 2025 / 07:22 PM IST

ఫేక్ కాల్ సెంటర్లతో జాగ్రత్త: సీఐ

HYD: ఫేక్ కాల్ సెంటర్లతో జాగ్రత్తగా ఉండాలని యాచారం సీఐ నరసింహారావు సూచించారు. ఆన్‌లైన్‌లో వేలాది ఫేక్ కాల్ సెంటర్లు ఉన్నట్లు తెలిపారు. ప్రముఖ కంపెనీల పేరిట నకిలీ వెబ్సైట్లు, ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనీ,ఫేక్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే మోసపోతారని క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దన్నారు.

February 4, 2025 / 07:13 PM IST

ఈతకు వెళ్లి బాలుడు మృతి

SRCL: ముస్తాబాద్ మండలంలో ఓ బాలుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. మొర్రపూర్ గ్రామానికి చెందిన భూక్య చరణ్ (16) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓ చెరువులో ఈత కొట్టాడు. చరణ్‌కు ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. బాలుడి వెంట ఉన్న ఇద్దరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

February 4, 2025 / 07:12 PM IST

‘ఆశా వర్కర్లపై పని భారం తగ్గించండి’

VZM: ఆశ వర్కర్లపై పని భారం తగ్గించాలని CITU జిల్లా కార్యదర్శి జగన్మోహన్‌ మంగళవారం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు యాప్‌లను రద్దు చేసి పని భారం తగ్గించాలని స్దానిక రూరల్‌, అర్బన్‌ ప్రాథమిక కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలతో వెట్టి చాకిరి చేపట్టించుకుని కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.

February 4, 2025 / 07:05 PM IST

GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

HYD: GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కార్పొరేటర్లు 15 మందిని స్టాండింగ్ మెంబెర్స్‌ను ఎన్నుకోనున్నారు. ఈ నెల 10 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 18న స్క్రూటినీ ఉండగా, నామినేషన్ల విత్ డ్రా 21న, 25న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో పోలింగ్, అదేరోజు సాయంత్రం అధికారులు ఫలితాలు ప్రకటించనున్నారు.

February 4, 2025 / 06:34 PM IST