KKD: కరపలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి ఓ ఆటో అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీ కొట్టిన ఆటో బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వారికి, ఆటోలో ఉన్నవారికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కరప పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.