MHBD: కురవి మండలం కందికొండ గ్రామానికి చెందిన BRS నాయకులు బండి యతీరాజు సోదరుడు రాజు ఇటీవల స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ, BRS జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత ఆదివారం వారి స్వగృహానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి, నివాళులు అర్పించారు. అలాగే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.