NDL: కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామంలో ముస్లిం సోదరుల స్మశాన వాటికకు రస్తా నిర్మించాలని ఆదివారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ టీడీపీ నాయకుడు వీఆర్ లక్ష్మీరెడ్డి స్మశాన వాటిక వద్దకు చేరుకున్నారు. ముస్లిం సోదరులకు స్మశాన వాటికకు రస్తా కేటాయిస్తామని లక్ష్మీరెడ్డి చెప్పడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.