CTR: మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నైజాన్ని ప్రతి ఇంటా తెలియజేయాలని వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. పుంగనూరులో ఆదివారం బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటేనని పెద్దిరెడ్డి అన్నారు.