MHBD: గంగారం మండలం రామరంలో కలప, టేకు అక్రమ తరలింపు జరుగుతున్న అటవీ శాఖ అధికారులు తనిఖీ చేయకపోవడంపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. గంగారం ఫారెస్ట్ రేంజ్ ఏర్పాటు తర్వాత పర్యవేక్షణ తగ్గినట్లు కనిపిస్తుంది. అటవీ శాఖ నిత్యం నిఘా బలోపేతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.