‘ధురంధర్ 2’ చిత్రంపై యూట్యూబర్ ధృవ్ రాఠీ విమర్శలు చేశాడు. దీన్ని పచ్చి ప్రచార చిత్రంగా అభివర్ణిస్తూ.. దర్శకుడు ఆదిత్య ధర్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని విమర్శించాడు. ఈ సినిమా చూస్తే మెదడు మొద్దుబారిపోతుందని ఎద్దేవా చేశాడు. అయితే, ఈ విమర్శలను లెక్కచేయకుండా ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.