MNCL: హైదారాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అదిరింపులు, బెదిరింపులకు ప్రజలు భయపడవద్దని కోరారు.