VZM: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గంట్యాడ మండల పరిధిలోని గ్రామాల్లో పంట నష్టం వివరాలపై రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సమగ్రంగా సర్వే నిర్వహిస్తున్నామని MAO శ్యాం కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏమైనా పంట నష్టం జరిగితే రైతు సేవ కేంద్రాల సిబ్బందికి తెలియజేస్తే వారు వచ్చి పంటలను పరిశీలించి నష్ట వివరాలపై సర్వే చేస్తారన్నారు.
కృష్ణా: కార్తీకమాసంలో పంచారామాల దర్శనానికి RTC స్పెషల్ సర్వీసులు బయలుదేరనున్నాయి. నవంబర్ 1, 2 తేదీల్లో శనివారం, ఆదివారం రాత్రి అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల నుంచి అలాగే నవంబర్ 3, 4 తేదీల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
MDK: ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి 18 నెలల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన చిన్నశంకరంపేటలో శుక్రవారం జరిగింది. గుడిబండకు చెందిన ధనంజయ్, స్వప్న దంపతుల కుమార్తె రుచిత ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బకెట్‌లో పడిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని వెంటనే మెదక్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిందని కుటుంబీకులు తెలిపారు.
ఆయిల్ పుల్లింగ్ వల్ల నోటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బ్యాక్టీరియా తగ్గి చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన, క్యావిటీస్ వంటి సమస్యలు తగ్గుతాయి. దంతాలు తెల్లగా మారుతాయి. ఆయిల్ పుల్లింగ్‌కు ఆలివ్, కొబ్బరి, నువ్వుల నూనెలను వాడొచ్చు. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ నూనెను నోట్లో వేసుకుని పుకిలించాలి. కొంత నీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ నూనె మింగకూడదు.
KKD: ఎస్వీ రంగారావు కళాస్రవంతి, కాకినాడ ఆధ్వర్యంలో నవంబర్ 1, 2 తేదీల్లో దంటు కళాక్షేత్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు నిర్వహించనున్నట్లు కళాస్రవంతి ప్రధాన కార్యదర్శి పి. వెంకన్నబాబు తెలిపారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు గుంటూరు వారి నాన్న, అనంతరం అనకాపల్లి వారి వేదాంతం, తీతిక్షలు నాటికలు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
MDK: ఉమ్మడి మెదక్ జిల్లా ఇందిరాగాంధీని ఎప్పటికీ మర్చిపోదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మునిపల్లి మండలం పెద్ద చల్మెడ గ్రామంలో ఆమె చిత్రపటానికి శుక్రవారం సాయంత్రం పూలమాలవేసి నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. జిల్లాకు కేంద్ర పరిశ్రమలు తీసుకువచ్చిన ఘనత ఇందిరా గాంధీకి దక్కుతుందని చెప్పారు.
TG: కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు వారం ముందుగానే రైతులు కపాస్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆయా కేంద్రాల్లో రైతులు క్యూలో ఇబ్బంది పడకుండా ఈ నిబంధన పెట్టినట్లు ఇప్పటికే అధికారులు స్పష్టంచేశారు. అలాగే బుకింగ్ చేసిన తేదీ, సమయానికే పత్తిని కేంద్రాలకు తరలించాలి, లేదంటే స్లాట్ రద్దు అవుతుంది.
ELR: పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం తాజాగా రూ.1,100 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేయనున్నారు. జనవరిలో మిగిలిపోయిన నిర్వాసితులకు ఈ పరిహారం అందనుంది.
AP: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపల మండలంలోని పెద్దన్నవారిపల్లిలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి లబ్ధిదారులతో కొంతసేపు ముచ్చటించనున్నారు.
KMR: మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. హైవేపై సర్వీస్ రోడ్ల వెంట ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో వాటిని అమ్ముకోలేక, ఇంటికి తీసుకెళ్ల లేక రెండు రోజులుగా రోడ్ల పక్కనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పగలు ధాన్యాన్ని ఆరబెడుతూ, రాత్రివేళ అక్కడే నిద్రపోతున్నారు.
AKP: మునగపాక సమీపంలో ఆవ కాలువకు గండి పడడంతో వరద నీరు ప్రధాన రహదారిపై ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మునగపాక నుంచి వాడ్రాపల్లి, మూలపేట, మంగళవారపు పేట, పాటిపల్లి తదితర గ్రామాలకు రోజు పలువురు రాకపోకలు సాగిస్తున్నారు. రహదారిపై ప్రవహిస్తున్న నీటితో ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
GDWL: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని, శైవ క్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించిందని గద్వాల డిపో మేనేజర్ సునీత శుక్రవారం తెలిపారు. అరుణాచల దర్శిని పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు 3 రోజుల్లో అరుణాచలం,గోల్డెన్ టెంపుల్,కాణిపాకం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. సూపర్ లగ్జరీలో రూ. 3,600, డీలక్స్‌లో రూ. 2,950 కలవు అని ఆమె పేర్కొన్నారు.
WNP: జిల్లా కేంద్రంలోని పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో శ్రీరంగాపూర్ ఎస్సై హిమబిందు ఇంగ్లీషు విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. గెలుపొందిన వారికి శుక్రవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ, డీఎస్పీ, సీఐలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
CTR: చౌడేపల్లి మండలం కాగతిలో శారదమ్మ ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదానికి పెట్రోల్ విక్రయాలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. వరండాలోని వెలిగించిన దీపం కారణంగా పెట్రోల్ క్యానులు,బాటిల్లకు మంటలు అంటుకొని ఇల్లంతా వ్యాపించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్ తోపాటు ఇంటిలోని వస్తువులు కాలిపోవడంతో సుమారు రూ. 5 లక్షల నష్టం చేకూరినట్టు బాధితులు వెల్లడించారు.
KRNL: హోళగుంద మండలం వందవాగిలి గ్రామంలోని శ్రీరుక్మిణీ పాండురంగస్వామి ఆలయంలో శుక్రవారం చోరీ జరిగింది. దొంగలు ఆలయ తాళాలను పగలగొట్టి, రూ.35 వేలు విలువైన 5 గ్రాముల బంగారు తాళిబొట్లు, రూ.10 వేలు విలువైన రెండు కంచు గంటలను ఎత్తుకెళ్లారు. హుండీ తాళాలను పగలగొట్టడానికి ప్రయత్నించిన దొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు.