సత్యసాయి: రామగిరి మండలంలోని ప్రసిద్ధ నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో మూడు హుండీలు ఉండగా.. ఒక దాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. వీఐపీ మార్గంలోని తాళాలు పగలగొట్టి హుండీని చోరీ చేశారు. అందులో రూ. 2 లక్షలు ఉన్నట్లు సమాచారం. హుండీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
HYD: ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సూక్ష్మ పరిశీలకులు సాధారణ పరిశీలకుల నియంత్రణలో పనిచేస్తారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విధుల్లో పాల్గొనే 120 మంది సూక్ష్మ పరిశీలకు ఎన్నికల విధులు, బాధ్యతలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిబంధనల మేరకు ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
NGKL: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నిరంతర కృషి ఫలితంగా బుధవారం నాగర్కర్నూల్‌కు కొత్త ఆర్టీఓ (RTO) కార్యాలయం మంజూరైంది. ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఆర్టీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధికారికంగా జీవోను విడుదల చేసింది. ఈ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించగా, సీఎస్ఆర్ నిధులతో రూ. 50 లక్షలతో నూతన భవనం నిర్మించనున్నారు.
NLR: చేజర్ల మండలంలో పెరుమాళ్ళ పాడు గ్రామంలో గ్రామ TDP నాయకుడు పలసాని ఈశ్వర్ రెడ్డి మొంథా తుఫాను కారణంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలుసుకొని గిరిజన కాలనీలో పేద ప్రజలకు నిత్యవసర సరుకులు బుధవారం రాత్రి పంపిణీ చేశారు. బియ్యం కందిపప్పు వంటివి 12 రకాల నిత్యవసర సరుకులు సుమారు 30 గిరిజన కుటుంబాలకు పంపిణీ చేసారు.
AP: శ్రీ సత్యసాయి జిల్లా చౌళూరులో కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని స్థానికులు సమీప ఆస్పత్రులకు తరలించగా.. ఏడుగురు కోలుకున్నారు. మిగతా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా డైజోఫాం వంటి రసాయనాలతో కల్తీ కల్లు తయారుచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తుండగా.. 5 రోజులుగా తాగుతుండటంతోనే బాధితులు ఆస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
NRPT: నవంబర్ 1 నుంచి అన్ని పాఠశాలల్లో రైడింగ్ క్యాంపెయిన్ చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్ నుంచి విద్యాశాఖ అధికారులతో జూమ్ ద్వారా మీటింగ్ నిర్వహించారు. పాఠశాలల పర్యవేక్షణ, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి, వర్క్ బుక్ ప్రాక్టీస్ తదితర కార్యక్రమాల పురోగతి అడిగి తెలుసుకున్నారు. ఈ జూమ్ మీటంగ్‌లో తదితర అధికారులు పాల్గొన్నారు.
ADB: భీంపూర్ మండలం తాంసి(K) గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం పులి సంచరిస్తోందని స్థానికులు తెలియజేశారు. దీంతో భయాందోళనలకు గురై పరుగులు తీయడం జరిగిందన్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు హైమద్ ఖాన్ ను సంప్రదించగా.. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పరిసర ప్రాంతాల్లో పులి అడుగుల కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం జరిగిందని వెల్లడించారు.
NLG: TG రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మంత్రి పదవి కేటాయింపుపై అసంతృప్తితో MLA రాజగోపాల్ రెడ్డి పార్టీపై తీవ్ర ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆయన CM రేవంత్ తో మాట్లాడి తన నిర్ణయాన్ని తెలియజేసినట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడలేదు.
GDWL: గద్వాల జిల్లాలోని విద్యార్థులు ఓపెన్ ఎస్సెస్సీ, ఓపెన్ ఇంటర్ కోర్సులలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ సునీతమ్మ బుధవారం తెలిపారు. ఈ నెల 31వ తేదీలోగా విద్యార్థులు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. చదువు మానేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
శ్రీకాకుళం పట్టణంలో నవంబర్ 2వ తేదీన జిల్లా కబడ్డీ జట్టులో ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడి జట్టు ఛైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో ఎంపికైన వారికి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనట్లు పేర్కొన్నారు. 2009 డిసెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. బాలికల బరువు 55 కేజీలు, బాలుర వయసు 60 కేజీలు కలిగి ఉండాలని తెలిపారు.
NDL: వర్షాల కారణంగా పంపు హౌస్‌లోని మోటార్ పంపులను ముందస్తు జాగ్రత్తగా తొలగించినట్లు నంద్యాల పురపాలక కమిషన్ శేషన్న తెలిపారు. దీంతో గురువారం హరిజనవాడ నడిగడ్డ నబీ నగర్ జగజ్జనని నగర్ ఫాతిమా నగర్ శ్రీనివాసు నగర్ పద్మావతి నగర్ సహా ప్రాంతాలలోని నేటి సరఫరాల అంతరాయం ఉంటుందని తెలిపారు.
PLD: పల్నాడు జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో నిర్మాణ నష్టం, నీరు నిలిచిపోవడం వంటి భద్రతా సమస్యలు తలెత్తితే, విద్యార్థులను వెంటనే సురక్షిత గదులకు తరలించాలని హెచ్‌ఎంలను, ప్రిన్సిపాళ్లను ఆమె ఆదేశించారు.
PPM: జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా అవసరమైన నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ సహాయం పునరావాస కేంద్రాలో ఉన్నవారికి, మత్స్యకారులకు ఉచితంగా అందిస్తామన్నారు.
W.G: జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రోజువారీ నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం అమలు చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి రూ.3 వేలు చొప్పున సహాయం అందజేయాలన్నారు.