ELR: తుఫాన్ తీవ్రమవుతున్న సమయంలో ఎటువంటి సహాయం కావాలన్నా సంప్రదించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇచ్చిన ప్రకటనకు మంగళవారం రాత్రి 11 గంటలకు టీ నర్సాపురం, పోలవరం, ముదినేపల్లి మండలాల నుంచి గ్రామస్థులు సహాయాన్ని కోరారు. వెంటనే స్పందించిన ఎంపీ సంబంధిత అధికారులకు, నాయకులకు సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరు భయపడవద్దని తుఫాను తీవ్రత తగ్గిపోతుందన్నారు
NGKL: అచ్చంపేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అచ్చంపేట శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న చంద్ర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా ముందస్తు చర్యలలో భాగంగా ప్రజలు ఎవరు కూడా ప్రమాదకరంగా వాగును దాటకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా ప్రమాదాలు చేయకూడదని పోలీసులు హెచ్చరించారు.
SKLM: ఎల్.ఎన్.పేటలో మెగా రక్షిత తాగునీటి పైపులైన్ లీకేజీ మరమ్మత్తులు కోసం ఇటీవలే సంబంధిత సిబ్బంది రెండు చోట్ల పెద్ద పెద్ద గోతులు తవ్వారని స్థానిక గ్రామస్తులు బుధవారం తెలిపారు. ఇప్పుడు కురిసిన తుఫాను వర్షాలకు ఆ గోతులు నీటితో నిండాయన్నారు. ఈ గోతులకు పక్కనే అలికాం బత్తిలి ప్రధాన రహదారి ఉండడంతో వాహనదారులు అదుపు తప్పితే ఈ గోతిలో పడే ప్రమాదం ఉందని తెలిపారు.
ELR: నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో ఓ హోటల్ సమీపంలో టిఫిన్ సేవిస్తూ బుధవారం వ్యక్తి చనిపోయిన సంఘటన విషాదాన్ని మిగిల్చింది. నూజివీడు పట్టడానికి చెందిన సురేష్ (46) అనే వ్యక్తి రోజువారి కూలి పనులు చేస్తుండే మృతునిగా గుర్తించారు. తుఫాను కారణంగా పనులు లేకపోవడం వలన స్నేహితుల వద్దకు వెళ్లి తిరిగి వస్తూ మృతి చెందాడు.
NLG: దేవరకొండ నియోజకవర్గంలో ‘మొంథా’ తుపాను కారణంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దేవరకొండ మున్సిపల్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని బయటకి అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సెల్: 9885361336, 9618224227, 9705303143, నెంబర్లను సంప్రదించాలని కోరారు.
KMR: పట్టణంలోని పలు కాలనీలలో బుధవారం ఉదయం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావంతో ఆకాశం మేఘావృతమై చీకటి ఆవరించిన వేళ, కరెంటు లేకపోవడంతో గృహిణీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం పనులకు వెళ్లాల్సిన ఉద్యోగులు కూడా అవస్థలు పడ్డారు. విద్యుత్ అంతరాయానికి కారణాలు తెలియరాలేదు. అధికారులు వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించాలని స్థానికులు కోరారు.
AKP: ఎస్. రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామ సమీపంలో విద్యుత్ తీగలపై చెట్టు పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మంగళవారం పడిన చెట్టును ఇప్పటివరకు తొలగించలేదు. అలాగే మండలంలో పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వాటన్నింటికి మరమ్మతులు చేపడుతున్నట్లు సిబ్బంది తెలిపారు. మధ్యాహ్ననికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి.
KMR: డోంగ్లి మండలంలోని మొగ గ్రామపంచాయతీ సెక్రెటరీ సక్రమంగా విధులను నిర్వహించడం లేదని మొగ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ‘ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎంపీడీవో ఆఫీస్ మీటింగ్ అని ఏదో ఒక వంకతో గ్రామపంచాయతీ మొగలో సెక్రెటరీ ఉండడం లేదు. సెక్రెటరీపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
VSP: మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. దీంతో మంగళవారం వాగులు, వంకలు, కొండలపై నుంచి వరద నీరు గోస్తని నదిలోకి చేరడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనికి తోడు తాటిపూడి జలాశయం నుంచి నీటిని వదలడంతో తదితర ప్రాంతాలలో వరద ఉద్ధృతి పెరిగి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సమీప ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా అధికారులు ఉండాలని కోరారు.
W.G: మొంథా తుఫాన్ ప్రభావంతో నరసాపురం, మొగల్తూరు మండలాలలోని సముద్రంలో రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. సముద్రం ముందుకు వచ్చిందని స్థానికులు తెలుపుతున్నారు. దీంతో అలలు ఉద్ధృతకు తీర ప్రాంతం గ్రామాలు పీఎం లంక, పేరుపాలెం, కేపీ పాలెం గ్రామాల్లో సముద్రం కోతకు గురయ్యింది. తుఫాన్ నేపథ్యంలో పర్యాటకులను పోలీసులు బీచ్‌లోకి అనుమతించడం లేదు.
ADB: బాలుడి కిడ్నాప్ యత్నం కేసును నమోదు చేశామని వన్ టౌన్ సీఐ సునీల్ తెలిపారు. యూపీలోని ఫైజాబాద్కు చెందిన రాహుల్ అనే యువకుడు ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీలో ఒక బాలుడిని అపహరించే యత్నం చేస్తుండగా కాలనీకి చెందిన షేక్ హసన్తోపాటు కొందరు పట్టుకున్నారని పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారన్నారు.
W.G: నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపులకొడపలోని ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్రానికి వెళ్లాలంటేనే బురద, నీళ్లలో నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. పునరావాస కేంద్రమే ముంపుకు గురైనట్లుగా కనిపిస్తుందని, ఈ నీటిలో ఈ భవనానికి వృద్ధులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని కొత్తపల్లి (కె) గ్రామానికి చెందిన సుమలత ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్‌ను ఎంపీడీవో కక్షతో నిలిపివేశారని మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. అర్హత ఉన్న తమ ఇంటిని కావాలనే ఆపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీఐ ద్వారా ప్రశ్నించగా, ఎమ్మెల్యే ఆదేశాలతో నిలిపినట్లు MPDO సమాధానం ఇచ్చారని వాపోయారు.
RR: షాద్‌నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ రోడ్డు విస్తరణ నేపథ్యంలో కంకర వేసి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. 2 నెలలు కావస్తున్న రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో వాహనదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ భారత నేవీకి చెందిన రఫేల్ యుద్ధవిమానంలో గగనవిహారం చేయనున్నారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం ఇందుకు వేదిక కానుండగా.. త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌గా ముర్ము రఫేల్‌లో విహరిస్తారు. 2023 ఏప్రిల్‌లోనూ ఆమె సుఖోయ్-30 MKI విమానంలో విహరించారు. రఫేల్ విమానాలను భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.