SKLM: నందిగం మండలం బడబంధ, కోటిపల్లి, కోటియా కొండపేట, బంజీరుపేట గ్రామాల రహదారి సమస్యలపై మంగళవారం నందిగం జనసేన పార్టీ అధ్యక్షుడు తాడేల చిరంజీవి, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్‌లో మంత్రిని కలిసిన ఆయన… రహదారి సమస్యలను వివరించి పరిష్కరించాలని మంత్రిని కోరారు.
ADB: నైజీరియా దేశంలో ఆదిలాబాద్ జిల్లా వాసి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన గోనెల మహేందర్ నైజీరియాలోని సిమెంట్ పరిశ్రమలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత మంగళవారం మహేందర్ గుండెపోటుతో మృతి చెందాడు.
కృష్ణా: పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని సీఎం అధికారిక నివాసంలో కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రిని కలిసిన బోడె ప్రసాద్ తన కుమారుడు వెంకట్ వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందజేశారు.
E.G: దేశంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టడం దారుణమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమండ్రి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ల కోసమే ప్రవేశపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
MNCL: జన్నారం మండలంలోని దేవునిగూడెంలో మిలిటరీ ఇంజనీరింగ్ ట్రైనీ అధికారుల పర్యటన కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం వారు ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, సిఎస్సీ మీసేవ కేంద్రాన్ని సందర్శించారు. మొదట పాఠశాలలో విద్యార్థులను కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అలాగే మీ సేవ కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
NRML: దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో బేటి బచావో బేటి పడావో పథకం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 45 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిసిపిఓ మురళి మాట్లాడుతూ లింగ సమానత్వం బాలికల చదువు సాధికారత బాల్యవివాహాల నిర్మూలన సైబర్ క్రైమ్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.
GNTR: జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ మంగళవారం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ను సందర్శించారు. నేరాలు, చోరీల నియంత్రణకు మండలంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై వెంకటరవితో కలిసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ASR: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా డుంబ్రిగూడ వైద్య సిబ్బంది PHC నుంచి మూడు రోడ్డుల జంక్షన్ వరకు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ పై అవగాహన పెంచుకుందాం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహిద్దాం అంటూ నినాదాలు చేశారు. క్యాన్సర్ లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్స, నివారణ గురించి ప్రజలకు సమాచారం అందించారు.
SKLM: రథసప్తమి సందర్భంగా భక్తులకు రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలోనే మంగళవారం ఓ వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సరోజిని తక్షణమే స్పందించారు. ఆమెకు సపర్యలు చేసి ఆలయ ప్రాంగణంలోని వైద్య శిబిరంలో చికిత్స చేయించారు.
కృష్ణా: జాతీయ రహదారిపై భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. మంగళవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ టోల్ గేట్ సమీపంలో విజిలెన్స్ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న రెండు లారీలను గుర్తించి అడ్డుకున్నారు. ఒక లారీలో 250 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరొక లారీలో సీఎంఆర్ బియ్యం ఉన్నాయని వాహనదారుడు రికార్డ్ చూపగా, వాటిని తనిఖీకు పంపించారు.
AKP: గొలుగొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ శ్యాం కూమార్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ శ్యాం కూమార్ క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవలసి జాగ్రత్తల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
KKD: మద్యం సేవించి వాహనాలు నడపడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని కాకినాడ సీనియర్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ అంబేద్కర్ భవన్లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మురళీకృష్ణ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఆటో డ్రైవర్లు ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు.
ASF: ఆసిఫాబాద్ జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా హింసకు గురైనట్లయితే నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం, భరోసా సెంటర్లు పని చేస్తున్నాయన్నారు.
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీకి డైరెక్టర్‌గా పరిచయం కానున్న విషయం తెలిసిందే. ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ పేరుతో ఓ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రధానపాత్రలో షారుఖ్ కుమార్తె సుహానా నటించింది. ఈ నేపథ్యంలో షారుఖ్ మాట్లాడుతూ.. తనపై ఉన్న ప్రేమలో సగమైనా సుహానా, ఆర్యన్‌లకు అందించాలని అభిమానులకు రిక్వెస్ట్ చేశారు.
TG: రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. శాసన సభ, మండలి.. ఉభయ సభలు రెండూ వాయిదా పడ్డాయి. నోట్స్, మినిట్స్ తయారీకి సమయం పడుతుందని.. అందుకు సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఈ క్రమంలో ఉభయ సభలను మ.2 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ వద్దకు వెళ్లి సభ వాయిదా విధానాన్ని ప్రశ్నించారు.