• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అత్యధిక మెజారిటీతో పేరాబత్తులను గెలిపించాలి’

కోనసీమ: రామచంద్రపురం పట్టణం చప్పిడి వారిసావరం, హౌసింగ్ కాలనీలలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచనల మేరకు మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అబ్జర్వర్ కాకినాడ రామారావు MLC అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

February 5, 2025 / 04:26 AM IST

‘హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి’

కోనసీమ: అమలాపురం రూరల్ మండల పరిధిలోని భట్నవిల్లిలో వాహనదారులకు మంగళవారం సాయంత్రం హెల్మెట్ ధారణపై సీఐ ప్రశాంత్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని జాతీయ రహదారి పక్కన నిలిపి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ.. వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నారు.

February 4, 2025 / 07:49 PM IST

ఈనెల 7న జాబ్ మేళా

W.G: పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ పరిశోధన సంస్థ సహ సంచాలకులు శ్రీనివాస్, హైదరాబాద్‌కు చెందిన డిబుల్ అగ్రి సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందన్నారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌లో డిగ్రీ లేదా డిప్లామో చేసిన వారు అర్హులన్నారు.

February 4, 2025 / 07:47 PM IST

పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు తహసీల్దార్ల బదిలీ

PDPL: జిల్లాలో శ్రీరాంపూర్ తహసీల్దార్ MD వకీల్, ఓదెల తహసీల్దార్ యాకన్న, ధర్మారం తహసీల్దార్ అరీఫుద్దీన్లను బదిలీ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టరేట్లో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న జగదీశ్వరరావును శ్రీరాంపూర్‌కు, సునీతను ఓదెల తహసీల్దారుగా అలాగే శ్రీరాంపూర్ తహసీల్దార్ వకీల్‌ను ధర్మారం తహసీల్దారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

February 4, 2025 / 07:24 PM IST

8 కారిడార్లలో రవాణా ఆధారిత అభివృద్ధి

HYD: మహానగరంలో మరిన్ని రవాణా ఆధారిత అభివృద్ధి(TOD) కారిడార్లకు HMDA ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ కారిడార్లలో ప్రత్యేక వ్యాపార, వాణిజ్య జోన్ల కోసం లోకల్ ఏరియా ప్లాన్లకు రూపకల్పన చేసేలా తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కారిడార్లలో రోడ్లకు ఇరువైపులా 500 మీటర్ల వరకు ప్రత్యేక నిబంధనలను వర్తింపజేయనున్నారు.

February 4, 2025 / 07:22 PM IST

ఫేక్ కాల్ సెంటర్లతో జాగ్రత్త: సీఐ

HYD: ఫేక్ కాల్ సెంటర్లతో జాగ్రత్తగా ఉండాలని యాచారం సీఐ నరసింహారావు సూచించారు. ఆన్‌లైన్‌లో వేలాది ఫేక్ కాల్ సెంటర్లు ఉన్నట్లు తెలిపారు. ప్రముఖ కంపెనీల పేరిట నకిలీ వెబ్సైట్లు, ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనీ,ఫేక్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే మోసపోతారని క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దన్నారు.

February 4, 2025 / 07:13 PM IST

ఈతకు వెళ్లి బాలుడు మృతి

SRCL: ముస్తాబాద్ మండలంలో ఓ బాలుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. మొర్రపూర్ గ్రామానికి చెందిన భూక్య చరణ్ (16) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓ చెరువులో ఈత కొట్టాడు. చరణ్‌కు ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. బాలుడి వెంట ఉన్న ఇద్దరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

February 4, 2025 / 07:12 PM IST

‘ఆశా వర్కర్లపై పని భారం తగ్గించండి’

VZM: ఆశ వర్కర్లపై పని భారం తగ్గించాలని CITU జిల్లా కార్యదర్శి జగన్మోహన్‌ మంగళవారం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు యాప్‌లను రద్దు చేసి పని భారం తగ్గించాలని స్దానిక రూరల్‌, అర్బన్‌ ప్రాథమిక కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలతో వెట్టి చాకిరి చేపట్టించుకుని కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.

February 4, 2025 / 07:05 PM IST

GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

HYD: GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కార్పొరేటర్లు 15 మందిని స్టాండింగ్ మెంబెర్స్‌ను ఎన్నుకోనున్నారు. ఈ నెల 10 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 18న స్క్రూటినీ ఉండగా, నామినేషన్ల విత్ డ్రా 21న, 25న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో పోలింగ్, అదేరోజు సాయంత్రం అధికారులు ఫలితాలు ప్రకటించనున్నారు.

February 4, 2025 / 06:34 PM IST

‘కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలి’

కోనసీమ: రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో MLC ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ పోలుపర్తి వెంకట గణేష్ కుమార్ పాల్గొన్నారు. గణేష్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల అభ్యర్థిని గెలుపుంచు కోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు.

February 4, 2025 / 06:25 PM IST

ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందించాం: మోదీ

రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో 14 సార్లు మాట్లాడే అవకాశం కల్పించిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని బలోపేతం చేస్తోందని అన్నారు. ప్రజలకు కొత్త ఆశను ఇస్తోందని, స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. తాము నకిలీ నినాదాలు ఇవ్వలేదని, ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందించామని వెల్లడించారు.

February 4, 2025 / 05:26 PM IST

చెవిలో పువ్వు పెట్టుకుని సీపీఎం నిరసన

KNR: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కరీంనగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని సీపీఎం నాయకులు చెవిలో పువ్వు.. చేతిలో చిప్ప పట్టుకుని తెలంగాణ చౌక్లో వినూత్నంగా నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించింది.. కానీ టీజీకి ఎందుకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు.

February 4, 2025 / 05:23 PM IST

‘గంజాయి నియంత్రణ పై ద్రుష్టి సారించండి’

KKD: జిల్లా నూతన ఎస్పీ బిందు మాధవ్‌ని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన నాయకులు డా బి ఎన్ రాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పరిస్థితులు తెలియజేసి జిల్లాలో దళితుల పై జరిగే దాడులను అరికట్టాలని, అలాగే యువత పై గంజాయి ప్రభావం విపరీతంగా ఉందని దాని కట్టడి పై దృష్టి సారించాలని కోరారు.

February 4, 2025 / 05:20 PM IST

రతన్ టాటా ఫ్రెండ్‌కు కీలక బాధ్యతలు

రతన్ టాటా ఫ్రెండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘శంతను నాయుడు’కి టాటా గ్రూప్‌లో కీలక పదవి దక్కింది. టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌కు జనరల్ మేనేజర్‌గా శంతను నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన లింక్డ్‌ఇన్ పోస్టులో షేర్ చేశారు. కాగా, టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్కుడైన శంతను 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా వ్యవహరించారు.

February 4, 2025 / 05:18 PM IST

BREAKING: వన్డే సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్

టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తిని ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిని ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగం చేశారు. ఈ సిరీస్‌లో అతడు రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా భాగమయ్యే అవకాశం ఉంది.

February 4, 2025 / 05:13 PM IST