• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘థెరెసా పేరు తప్పుగా వాడితే చర్యలు’

తమ స్వార్థం కోసం మదర్ థెరెసా పేరును తప్పుగా వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని కోల్‌కతాకు చెందిన ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ హెచ్చరించింది. అనుమతి లేకుండా ఆమె పేరు వాడటం అంగీకారం  కాదంటూ.. నిధుల సమీకరణ, ప్రచారాల కోసం ఉపయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తన పేరును ఇలా వాడుకోవడానికి ఆమె ఎప్పుడూ ఇష్టపడలేదని, ఇకపై ఇలాంటివి ఆపేయాలని స్పష్టంచేసింది.

March 22, 2026 / 09:28 AM IST

బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ గందరగోళం

TG: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యం హఠాత్తుగా సెలవులు ప్రకటించింది. ఒకవైపు విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతుండగానే అసాధారణ సెలవులు అంటూ ప్రకటన జారీ చేసింది. అయితే, అసాధారణ పరిస్థితులపై యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు. వెంటనే హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లాలంటూ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 22, 2026 / 09:25 AM IST

మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా!

HYD: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈనెల 13న దొడ్ల ప్రతాప్ గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డి అకౌంటెంట్‌కు వాట్సాప్‌లో డబ్బులు పంపాలని మెసేజ్ వచ్చింది. డైరెక్టర్ దివ్యారెడ్డి ఫొటో డీపీ ఉండటంతో అకౌంటెంట్ దాంట్లో సూచించిన ఖాతాకు రూ.1.20 కోట్లు బదిలీ చేశారు. మరోసారి డబ్బులు పంపించాలని సూచించడంతో మోసం బయట పడింది.

March 22, 2026 / 09:25 AM IST

కొండెక్కిన చికెన్ ధరలు

WG: ఆకివీడులో చికెన్ ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇవాళ కిలో చికెన్ ధర రూ.380కి చేరింది. ఐదు రోజుల క్రితం రూ.340 ఉన్న ధర, త్వరలోనే రూ.400 దాటుతుందని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరలతో మాంసప్రియులు బెంబేలెత్తుతున్నారు. ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకు లభిస్తున్న కోడిగుడ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.

March 22, 2026 / 09:25 AM IST

‘గురుకుల పాఠశాల పనులు వెంటనే మొదలెట్టాలి’

PLD: రెంటచింతల (M) మిట్టగుడిపాడు సమీపంలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అధికారులను ఆదేశించారు. గత DEC 24న భూమిపూజ నిర్వహించినా, ఇప్పటికీ మొదలుకాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ITDA DE రియాజుద్దీన్‌ను వివరణ కోరారు. ఆదివారం స్వయంగా నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తానని ఆయన స్పష్టం చేశారు.

March 22, 2026 / 09:25 AM IST

రేపటి నుంచి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

SRD: జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఈనెల 23 నుంచి ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు DMHO డాక్టర్ వసంత రావు తెలిపారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి, సదాశివపేట, పటాన్‌చెరు, జోగిపేట ఏరియా ఆసుపత్రులతో పాటు 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేయనున్నారు. రోగుల ఆరోగ్య వివరాలన్నీ డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉంటాయన్నారు.

March 22, 2026 / 09:24 AM IST

ఆగాపేటలో రేపే మెగా వైద్య శిబిరం

JN: నర్మెట్ట మండలం ఆగాపేట గ్రామంలో రేపు మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ రాజు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరుకావాలని శనివారం రాత్రి సర్పంచ్ రాజు, ఉప్ప సర్పంచ్ అనిల్ కుమార్ ఆహ్వాన పత్రం అందజేశారు. MLA మాట్లాడుతూ.. వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 22, 2026 / 09:24 AM IST

ఖాజీపేటలో నేడు సాయంత్రం RSS ర్యాలీ..!

KDP: ఖాజీపేటలో ఆదివారం సాయంత్రం RSS ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టనున్నట్లు నిర్వహకులు హరినాధ్ రెడ్డి తెలిపారు. మైదుకూరు రోడ్డులోని రెయిన్‌బో పాఠశాల నుంచి ర్యాలీ మొదలై టీచర్స్ కాలనీ, బీచావారిపల్లి సర్కిల్, అమ్మవారి శాల మీదుగా బస్టాండ్ కూడలి వరకు, అక్కడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు.

March 22, 2026 / 09:23 AM IST

నేడు జిల్లాలో ‘సంసద్ ఖేల్ ఇండియా’

భువనగిరి: జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఇవాళ సాయంత్రం నిర్వహించనున్న ‘ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ ఇండియా’ మహోత్సవ ఏర్పాట్లను బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ క్రీడా సంబరాలకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

March 22, 2026 / 09:21 AM IST

ప్రపంచ ప్రకృతి దినోత్సవం సందర్భంగా అవగాహనా ర్యాలీ

MDK: రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం ప్రపంచ ప్రకృతి దినోత్సవం సందర్భంగా సైక్లింగ్ నిర్వహించారు. ఖేలో ఇండియా సైక్లింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకృతి రక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రజలకు అవగాహన కల్పించారు.

March 22, 2026 / 09:21 AM IST

మళ్లీ ప్రారంభం కానున్న వారాంతపు సంత

NZB: బోధన్ మండలం కల్దుర్కిలో ఈ నెల 25 నుంచి వారాంతపు సంతను తిరిగి ప్రారంభించనున్నారు. గ్రామస్తుల సౌకర్యార్థం ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సంత నిర్వహించనున్నట్లు వీడీసీ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.

March 22, 2026 / 09:21 AM IST

నీటిని పొదుపుగా వాడండి: జీవీఎంసీ కమిషనర్

VSP: వేసవిలో నీటిని పొదుపుగా వాడాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. ప్రస్తుతం విశాఖకు రోజుకు 400 MLD నీటి అవసరం ఉండగా, 2047 నాటికి 726 MLDకు పెరుగుతుందన్నారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజలు జాగ్రత్తగా నీటిని వినియోగించాలని సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం నీటి వనరులను కాపాడుకోవాలని తెలిపారు.

March 22, 2026 / 09:20 AM IST

డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు మరింత కఠినం

TG: రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో రవాణా శాఖ కీలక మార్పులు చేస్తోంది. ఇకపై లైసెన్స్ పొందాలంటే కొత్తగా ఆన్‌లైన్ పరీక్షను తప్పనిసరి చేయనుంది. ఈ విధానం APR 1 నుంచి అమల్లోకి రానుంది. LLRకు దరఖాస్తు చేసే ముందే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతా పాఠాలు విని పరీక్ష రాయాలి. ఇందులో ఉత్తీర్ణులై సర్టిఫికెట్ నంబర్ పొందాకే LLR స్లాట్ బుక్ చేసుకోవాలి.

March 22, 2026 / 09:20 AM IST

జిల్లా రూపు రేఖలు మారుస్తున్న కార్పొరేషన్ మార్పు

NLG: జిల్లాలో పారిశ్రామిక సందడి మొదలైంది. ఒకప్పుడు కేవలం వ్యవసాయానికే పరిమితమైన ఈ ప్రాంతం, ఇప్పుడు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేరాఫ్‌గా మారుతోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారిన తర్వాత పరిశ్రమల రాక పెరుగుతోంది. తాజాగా విడుదలైన ‘తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2026’ ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది.

March 22, 2026 / 09:19 AM IST

‘పన్నుల వసూళ్లు యుద్ధప్రాతిపదికన రాబట్టాలి’

KMM: ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 10 రోజులే గడువు ఉండటంతో ఖమ్మం నగరపాలక సంస్థ (కేఎంసీ) పన్నుల వసూళ్లను వేగవంతం చేసింది. శనివారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులతో సమీక్ష నిర్వహించి అన్ని విభాగాల సిబ్బందిని వసూళ్ల ప్రక్రియలో భాగస్వాములను చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాత బకాయిలను కూడా యుద్ధప్రాతిపదికన రాబట్టాలని అధికారులను ఆదేశించారు.

March 22, 2026 / 09:19 AM IST