• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పుష్పాలంకరణలో నందవరం చౌడేశ్వరి దేవి

NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఇవాళ అమ్మవారు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు రుద్రాభిషేకం, మహా మంగళహారతి వంటి పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్లలో నిల్చొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

March 22, 2026 / 08:53 AM IST

అభివృద్ధి పనుల్లో వేగం.. సీసీ రోడ్డు పనులు ప్రారంభం

BPT: పర్చూరు మండలం నూతలపాడులో గ్రామాభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ఎస్సీ కాలనీలో రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి పీఎసీఎస్ ఛైర్మన్ విన్నకోట సతీశ్, స్థానిక నేతలు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మద్దతుతో గ్రామంలో రహదారి సౌకర్యాలు మెరుగుపర్చే దిశగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.

March 22, 2026 / 08:53 AM IST

కల్తీ టీపై అప్రమత్తంగా ఉండండి: ఎమ్మెల్యే

KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కల్తీ టీ పొడి విక్రయాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మార్కెట్‌లో నకిలీ టీ విస్తృతంగా అమ్ముడవుతోందని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని ఎమ్మెల్యే వెల్లడించారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

March 22, 2026 / 08:53 AM IST

ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: తూర్పు గోదావరి జిల్లా యర్నగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా హైవే డివైడర్‌ను దాటి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప గోపాలపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 22, 2026 / 08:53 AM IST

ఈ నెల 26న కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

SDPT: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థాన హుండీల లెక్కింపు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తులు సమర్పించిన నగదు, బియ్యం హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సంబంధిత శాఖల అధికారులు, బ్యాంక్ సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని ఆలయ ఈవో సూచించారు.

March 22, 2026 / 08:52 AM IST

ఐయిదు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

KDP: ప్రొద్దుటూరు మండల పరిధిలోని చౌడూరు పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు గ్రామీణ ఠాణా సీఐ నాగభూషణ్ తెలిపారు. మొత్తం 5 ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. అనుమతి లేనిచోట అక్రమంగా తవ్వకాలు చేసి ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.

March 22, 2026 / 08:52 AM IST

కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు

అన్నమయ్య: రాయచోటి బైపాస్ వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. లక్కిరెడ్డిపల్లి నుంచి వస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

March 22, 2026 / 08:52 AM IST

రోజుకు 700 కేసులు.. ట్రామా సేవలపై ఒత్తిడి

WGL: ఎంజీఎం ఆసుపత్రి క్యాజువాలిటీ విభాగానికి రోజూ 500 నుంచి 700 వరకు కేసులు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. వీటిలో 150 నుంచి 200 వరకు ట్రామా కేసులు ఉండగా, 30 నుంచి 50 వరకు మేజర్ కేసులు, మిగతావి మైనర్ కేసులేనని పేర్కొన్నారు. పెరుగుతున్న రోగుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిలో ట్రామా కేర్ విభాగాన్ని విస్తరించితే మరిన్ని ప్రాణాలు కాపాడవచ్చని నిపుణులు తెలిపారు.

March 22, 2026 / 08:51 AM IST

సీపీఐ కాలనీలో ఆపరేషన్ వజ్రపహార్

సత్యసాయి: పెనుకొండలోని సీపీఐ కాలనీలో ‘ఆపరేషన్ వజ్రపహార్’ కింద పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా డ్రోన్ కెమెరా సహాయంతో గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అనుమానిత వ్యక్తుల యొక్క ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నర్సింగప్ప, సీఐ రాఘవన్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

March 22, 2026 / 08:45 AM IST

పశ్చిమ గోదావరికి రెడ్ అలర్ట్

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వాతావరణ శాఖ ఇవాళ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

March 22, 2026 / 08:44 AM IST

బైపాస్ రోడ్డు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

KNR: హుజురాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారి బైపాస్ రోడ్డు వద్ద ఏఎస్సై కమల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనదారులను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, పోలీస్ సిబ్బంది మధు, మల్లయ్య, అంజలి, శ్రీధర్, అఖిల్, హోంగార్డు శ్రీను, రాజు పాల్గొన్నారు.

March 22, 2026 / 08:42 AM IST

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 1800 కోట్లు

MBNR: ఉమ్మడి జిల్లా పరిధిలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో 1800 కోట్ల కేటాయించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెరుగుతుందంటూ ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి జిల్లాలోని మిగతా ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది.

March 22, 2026 / 08:41 AM IST

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎమ్మెల్యే తనిఖీలు

NLR: విడవలూరులోని వావిల్ల రోడ్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. లారీలు, గోన సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

March 22, 2026 / 08:40 AM IST

’23న PGRS కార్యక్రమం’

E.G: జిల్లాలోని రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23న పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి  తెలిపారు. ప్రజలు తమ అర్జీలను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే అర్జీల స్థితి, నమోదు వివరాల కోసం 1100కు కాల్ చేయవచ్చని వెల్లడించారు.

March 22, 2026 / 08:40 AM IST

నార్కోటిక్ డాగ్ సాయంతో గంజాయి పట్టివేత

విశాఖలో గంజాయి, ఇతర నార్కోటిక్ డ్రగ్ కట్టడిలో భాగంగా RTC కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, బీచ్ రోడ్, తదితర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ బృందాలు నిఘా చేపట్టాయి. శనివారం జ్ఞానాపురం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 2 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరిని తదుపరి చర్యలకై కంచరపాలెం పోలీసులకు అప్పగించారు.

March 22, 2026 / 08:40 AM IST