• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Delhi Mayor:గా ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ విజయం

గత ఏడాది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధికంగా విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మూడు విఫల ప్రయత్నాల తర్వాత ఈరోజు తన మేయర్‌ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులకు ఓటు వేయాలనే నిర్ణయంపై ఆప్, బీజేపీ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గతంలో మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశాలు వాయిదా పడ్డాయి.

February 22, 2023 / 05:17 PM IST

Ugram Teaser: ఉత్కంఠ రేపుతున్న ఉగ్రం టీజర్

హీరో అల్లరి నరేష్ నటించిన ఉగ్రం మూవీ టీజర్ రిలీజైంది. టీజర్లో నరేష్ యాక్టింగ్, ఫైట్స్ సహా పలు సీన్లు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. నాంది ఫేం డైరెక్టర్ విజయ్ కనకమేడల, నరేష్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇప్పటికే నాంది బంపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

February 22, 2023 / 03:46 PM IST

Prabhu: అస్వస్థతకు గురైన ప్రముఖ తమిళ నటుడు ప్రభు

తమిళ నటుడు ప్రభు అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మాత్తుగా తనకు కిడ్నీలో రాళ్ల నొప్పి రావడంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ప్రభు బాగానే ఉన్నాడని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని వైద్యులు ప్రకటించారు.

February 22, 2023 / 02:52 PM IST

Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష బరిలో కేరళ సంతతి…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామస్వామి ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కూడా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిక్కీ హేలీ బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు.

February 22, 2023 / 02:05 PM IST

Farewell గవర్నర్ కాళ్లు మొక్కిన సీఎం జగన్

కరోనా సమయంలో మీరు అందించిన సహకారం, మద్దతు మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. 44 నెలల పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్ల తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని పేర్కొన్నారు.

February 22, 2023 / 01:34 PM IST

straydogs bite:వీధికుక్కల స్వైరవిహరం.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్

straydogs bite:వీధి కుక్కలు (straydogs) స్వైరవిహరం చేస్తున్నాయి. అంబర్ పేట (amberpet) ఘటనతో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంబర్ పేట తర్వాత చైత్యనపురి.. అటు నుంచి కరీంనగర్‌లో (karimnagar) కూడా స్ట్రీట్ డాగ్స్ రెచ్చిపోయాయి. వరస ఘటనలతో కుక్కల బెడదపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వీధి కుక్కల నియంత్రణపై చర్యలేవి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

February 22, 2023 / 01:17 PM IST

Subi Suresh: ప్రముఖ యాంకర్ కన్నుమూత.. సీఎం దిగ్భ్రాంతి

గృహనాథన్, తస్కర లహల, ఎల్సమ్మ ఎన్న ఆన్ కుట్టీ, హ్యాపీ హస్బెండ్స్, కనకసింహాసనం తదితర సినిమాల్లో సుభి నటించింది. ఇలా దాదాపు 20 సినిమాల్లో నటించింది. అతి చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం కలచి వేస్తోంది. ఆమె అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆమెకు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

February 22, 2023 / 01:16 PM IST

Neha Singh : భోజ్‌పురి గాయనికి యూపీ పోలీసులు నోటీసులు

భోజ్‌పురి (Bhojpuri) జానపద గాయని నేహా సింగ్ (Neha Singh) రాథోడ్‌కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు (UP Police) షాకిచ్చారు. ఆమె ఇటీవల విడుదల చేసిన ఒక పాటలో ఉత్తర ప్రదేశ్‌పై విమర్శలు చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. బిహార్‌కు చెందిన నేహా సింగ్ భోజ్‌పురి జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

February 22, 2023 / 01:00 PM IST

McKinsey layoffs: మెకెన్సీలో 2000 ఉద్యోగాల కోత, ఆ కంపెనీలోను…

వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోత (layoffs) కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకెన్సీ (McKinsey) 2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ క్లయింట్స్ తో నేరుగా సంబంధాలు ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకెన్సీ ఉందని వార్తలు వస్తున్నాయి.

February 22, 2023 / 12:59 PM IST

La nestam : లాయర్లకు భృతి విడుదల చేసిన ఏపీ సీఎం జగన్

ఏపీ సీ ఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ లా నేస్తం( Lanestam )పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు. తాడేపల్లి (Tadepalli) సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి దీన్ని ప్రారంభించారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకు ‘లా నేస్తం’ అని సీఎం అన్నారు.

February 22, 2023 / 12:37 PM IST

KGF actor into BJP: బీజేపీలోకి కేజీఎఫ్ నటుడు

ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు (sandalwood), మాజీ మంత్రి అనంత్ నాగ్ (Ananth Nag) ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. కర్నాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నలిన్ కటీల్ ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు పార్టీ కార్యాలయంలో కమల తీర్థం పుచ్చుకోనున్నారు.

February 22, 2023 / 12:26 PM IST

KSRTC : పార్క్ చేసిన ఆర్టీసీ బస్సు చోరీ

కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు చోరీ (Chori) కావడం కలకలం రేపింది. రాత్రిపూట బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసిన బస్సు తెల్లారేసరికి మాయమైంది. దీంతో ఆర్టీసీ (RTC) అధికారులు పోలీసులను ఆశ్రయించారు.

February 22, 2023 / 11:34 AM IST

Air India విమానంలో ఆయిల్ లీక్.. ఆందోళనలో 300 మంది

అధికారులు వాస్తవ పరిస్థితిని తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించింది. కాగా రెండు రోజుల వ్యవధిలో ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆ విమానం కూడా అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

February 22, 2023 / 11:40 AM IST

Drunk and Drive తాగుబోతులకు సముద్రంలో శిక్ష.. దెబ్బకు మత్తు దిగింది

వాహనదారులకు జరిమానా విధిస్తే మార్పు రావడం లేదని కోర్టు భావించింది. వారిలో పరివర్తన రావాలనే ఉద్దేశంతో వారికి బాధ్యత తెలియాలనే ఉద్దేశంతో బీచ్ క్లీనింగ్ శిక్ష విధించింది. జరిమానాల వలన ఒరిగిదేమిటి లేదు. ఇలాంటి శిక్షల ద్వారా వారిలో మార్పులు వస్తుందని భావిస్తున్నా. వీటితో పాటు హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి కూడా అవగాహన కల్పిస్తున్నాం.

February 22, 2023 / 11:07 AM IST

Delhi Mayor Election: కాసేపట్లో ఢిల్లీ మేయర్ ఎన్నిక

ఢిల్లీ మేయర్ ఎన్నిక (Delhi Mayor Election) ఈ రోజు (బుధవారం, ఫిబ్రవరి 22) జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2022 డిసెంబర్ 7న ప్రకటించిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి 104 (bharatiya janata party), ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Admi party) 134, కాంగ్రెస్ పార్టీకి (Congress) 9 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.

February 22, 2023 / 10:44 AM IST