తెలంగాణలో రానున్న రోజుల్లో లైఫ్ సైన్సెస్ రంగంలో 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఇదే విభాగంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల మంది ఉద్యోగాలను 2028 నాటికి రెట్టింపు చేస్తామని వెల్లడించారు.
coconut water and lemon juice:కొబ్బరి బొండంలో (coconut) నిమ్మరసం (lemon juice) కలిపి తాగితే మంచిదే. డీ హైడ్రేషన్ తొందరగా ఎదుర్కొవచ్చు. వెంటనే శక్తిని అందజేస్తోంది. స్కిన్ (skin) హెల్దీగా ఉండేందుకు సాయం చేస్తోంది. కొబ్బరి బొండం, నిమ్మ రసం కలిపి తీసుకుంటే విటవిన్లు, ఖనిజాలు పుష్కలం.. ఎలక్ట్రోలైట్లను ఇస్తోంది.
Lokesh Padayatra : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయం గా కొనసాగుతోంది. యువగళం పేరిట ఆయన చేపట్టిన యాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో... తొండమానుపురంర గ్రామంలో లోకేష్ ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
సాధారణంగా పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఏం చేసేందుకైనా సిద్ధపడతారు. అది మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా అంతకు మించి ఉందని నిరూపించాయి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పోర్కుపైన్ జాతికి చెందిన పిల్లలను ఓ చిరుత వేటాడేందుకు రాగా..వాటి పేరెంట్స్ అడ్డుగా నిలిచి చిరుతపై పోరాడి పిల్లలను కాపాడుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ రవాణా శాఖ నోటీసులో స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓలా, ఉబర్, రాపిడో రైడర్స్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు ఢిల్లీలో బైక్ ట్యాక్సీ సేవలను కొనసాగిస్తే జరిమానా విధించబడుతుందని వెల్లడించింది.
హైదరాబాద్ లో అంబర్ పేట (Amber Peta) దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల (dogs)దాడి నుంచి తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతో నిస్సాహాయంగా వాటికి బలయ్యాడు. ఒంటరిగా రావడమే బాలుడు చేసిన పాపమైంది.
అమృత్‌సర్‌కు చెందిన రెండేళ్ల తన్మయ్ 195 దేశాల జెండాలను గుర్తించడం ద్వారా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడని అతని తల్లి హీనా నారంగ్ తెలిపారు. ఇంత చిన్న వయస్సులోనే తన్మయ్ అరుదైన ఘనతను సాధించడం పట్ల బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ బాబు తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు భగవద్గీతను ఎక్కువగా విన్నానని వెల్లడించింది.
గవర్నర్ కు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో గవర్నర్ మూడున్నరేళ్ల కాలాన్ని ఒకసారి నెమరు వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇకపై తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు.
భారత చలన చిత్ర పరిశ్రమలో దాదా సాహెబ్ పాల్కేను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) సోమవారం రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన ట్రిపుల్ అర్, కాంతార సినిమాలు అవార్డు దక్కించుకున్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను సొంతం చేసుకున్నది. కలెక్షన్స్ సునామీ సృష్టించిన కాంతారా సినిమాలో నటనకు గాను ...
ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) లో అప్పడే ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) జోస్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ (Pawan Kalyan) బస్సు యాత్రకు ముందు, బస్సు యాత్రకు తరువాత అంటూ రెండు రకాల సర్వే ఫలితాలను ఆయన సోషల్ మీడియా (Social media )లో పోస్టు చేశారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాదం ఐరన్ లెగ్ అని, మోసం చేసి బ్రతకటం మాత్రమే తెలుసునని మంత్రి గోవర్థన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
Breaking News : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కలకలం రేగింది. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
తెలంగాణలో (Telangana) మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలు కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ( MLC) ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికల జరగనుంది. వీటిలో ఒకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కాగా.. మరొకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.
Breaking News : టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. ఇటీవల టర్కీ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి 40వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోట్లలో ఆస్తి నష్టం కలిగింది.
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారు (Sportsmen)లకు పెద్ద పీట వేస్తోంది. ఇటీవల భారత షూటర్ ఇషాసింగ్ (Esha Singh) కు కూడా స్థలం పత్రాలను ఇచ్చారు. గతంలోనూ సానియా మీర్జా, పీవీ సింధు తదితరులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నగదు బహుమతితో పాటు ఉద్యోగాలను ప్రకటించింది. ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది.