BDK: నాయి బ్రహ్మణ సంఘం నాయకులు, చిరకాల మిత్రుడు గుడివాడ నాగేశ్వరరావు మృతి పట్ల ఎమ్మెల్యే కోరం కనకయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం వారి కుటుంబ సభ్యులను ఎంఎల్ఏ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్ట సమయంలో ఉన్న వారి కుటుంబానికి కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.