పాకిస్థాన్‌లో గల కరాచీ పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆ ఆఫీసు షేర్షియా ఫైసల్ వద్ద ఉండగా.. సాయుధులు చొరబడి కాల్పులు ప్రారంభించారు. పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని జియో న్యూస్ రిపోర్ట్ తెలిపింది.
సుప్రీంకోర్టులో(Supreme Court) కేజ్రీవాల్ పార్టీ ఆప్ కు పెద్ద ఊరట లభించింది. మేయర్ (Mayor) ఎన్నికలకు సంబంధించి బీజేపీ, ఆప్ ల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. నామినేటెడ్ మెంబర్ల సాయంతో మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని బీజీపీ (bjp) యత్నిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.
తెలంగాణ (Telangana) రాష్ట్రానికి మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి హరీష్ రావు( harish rao) అన్నారు. ఖమ్మం, కరీంనగర్‌కు మెడికల్ కాలేజీలు ఇవ్వమని కేంద్రం చెప్పడంపై ఆయన కేంద్రపై ధ్వజమెత్తారు.
EC allots Shiv Sena name to shinde:శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే ( bal Thakeray) కుమారుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరేకు ( Uddhav Thakeray) కేంద్ర ఎన్నికల సంఘం (ec) షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేదే (ekanth shinde) అసలైన శివసేన అని అధికారికంగా గుర్తించింది.
ఏపీ సీఎం జగన్ (CM Jagan) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన కేబినెట్‌లో (Cabinet) పని చేస్తున్న ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని సమాచారం. వారి స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో ( hero)మోటోకార్ప్' (MotoCorp) తాజాగా జూమ్ హైటెక్ స్కూటర్ ను తెలంగాణ (Telangana) లో విడుదల చేసింది.ఇది 110 సీసీ స్కూటర్. మరే స్కూటర్ కు లేని విధంగా దీంట్లో తొలిసారిగా కార్నర్ బెండింగ్ లైట్స్ అమర్చారు.
క్రికెట్ (Cricket) అభిమనులకు శుభవార్త. ఐపీఎల్ (IPL) 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో జరగనున్నాయి. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. 70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది.
బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ లోనూ భారత స్పిన్నర్లు రికార్డు నెలకొల్పారు. రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహమ్మద్ షమీ(Mahammad shami) 4 వికెట్లు పడగొట్టాడు.
కర్ణాటక (Karnataka) సీఎం బసవరాజు బొమ్మై ప్రభుత్వనికి కాంగ్రెస్ (Congress) నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెవిల్లోకి పువ్వులతో కనిపించారు. మాజీ సీఎం విపక్ష నేత సిద్దరామయ్య (Siddaramaiah) తోపాటు మరికొంత ఎమ్మేల్యేలు చెవిలో పూలు పెట్టుకుని సభకు వచ్చారు.
Somu Verraju : కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ ని వీడిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ వీడి వెళ్తూ వెళ్తూ సోము వీర్రాజు పై తీవ్ర విమర్శలు చేశారు. సోము వీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడినట్లు ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. కాగా... తాజాగా.. కన్నా తనపై చేసిన కామెంట్స్ పై సోము వీర్రాజు స్పందించారు.
KTR : అందరికీ ఒకే అబద్దం నేర్పించాలని... ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని కేంద్రంలోని అధికార పార్టీపై మంత్రి కేటీఆర్ చురకలు వేశారు. తెలంగాణకు వైద్య కళాశాలల మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంత్రులు చెప్పేవన్నీ అబద్దాలని.. కనీసం అబద్ధాలనైనా అందరూ ఒకేలా చెప్పాలని, దాని కోసం కేంద్ర మంత్రులకు సరైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోడీకి సూచించారు.
ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవల దాడి జరిగిన ఘటనలో భోజ్‌పురి నటి సప్నా గిల్ అరెస్టయ్యారు. పృథ్వీ షాతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీక్రెట్ బాక్సులో రాగి కంకులు పైన పెట్టి కింద గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 23 కిలోలలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ కొండాపూర్ పరిధిలో చోటుచేసుకుంది.
కొన్ని కారణాల వల్ల భారతీయ రైల్వే (Railway) పలు రద్దు చేసింది. ట్రాకింగ్ ( Track) పనులు ఇతర మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు (cancellation) చేయడం, దారి మళ్లించడం లాంటిది చేస్తుంటుంది. 440 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
బాలీవుడ్ (Bollywood) నటి స్వర భాస్కర్ పెళ్లి పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ (Kangana Ranaut)ట్వీట్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhaskar) సీక్రెట్ పెళ్లి చేసుకొని, ఆ విషయాన్ని నిన్న (ఫిబ్రవరి 16) తన ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేసింది.