IND vs AUS : రెండో టెస్టులో 263 రన్స్‌కు ఆస్ట్రేలియా ఆలౌట్
బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ లోనూ భారత స్పిన్నర్లు రికార్డు నెలకొల్పారు. రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహమ్మద్ షమీ(Mahammad shami) 4 వికెట్లు పడగొట్టాడు.
ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్(Test series) లో భాగంగా తొలి మ్యాచ్ లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. నేడు రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ లోనూ భారత స్పిన్నర్లు రికార్డు నెలకొల్పారు. టీమిండియా సీనియర్ స్పిన్నర్లు అయిన రవిచంద్రన్ అశ్విన్(Ashwin), రవీంద్ర జడేజా(Jadeja)లు అరుదైన ఘనతను సాధించారు. టీమిండియా తరపున 100 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా అశ్విన్(Ashwin) రికార్డు సృష్టించాడు.
టెస్ట్ క్రికెట్(Test Cricket) లో 250 వికెట్ల క్లబ్ లోకి రవీంద్ర జడేజా(Jadeja) చేరాడు. అంతేకాకుండా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా అనిల్ కుంబ్లే పేరుపై రికార్డు ఉండేది. అనిల్ కుంబ్లే 111 వికెట్లు తీశాడు. ఆ తర్వాత రెండో స్థానంలో అశ్విన్(Ashwin) నిలిచాడు. రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో టీమిండియా తరపున మహమ్మద్ షమీ(Mahammad shami) 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే అశ్విన్(Ashwin), జడేజా(Jadeja)లు చెరో 3 వికెట్లు తీశారు.
Stumps on Day 1⃣ of the second #INDvAUS Test!#TeamIndia openers see through the final overs of the day's play and finish with 21/0 👌
We will be back with action tomorrow on Day 2, with India trailing by 242 more runs.
ఆస్ట్రేలియా ఆటగాడు హ్యాండ్స్కాంబ్ 72 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మూడో సెషన్ లో రవీంద్ర జడేజా(Jadeja) ఒకే ఓవర్లో కమిన్స్, మర్ఫీని ఔట్ చేశాడు. ఆ తర్వాత షమీ ఆస్ట్రేలియా బ్యాటర్లను టెన్షన్ పెట్టించాడు. లయాన్, కుహ్నెమన్ ను బౌల్డ్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరదించాడు. ఈ మ్యాచ్ లో మహమ్మద్ షమీ(Mahammad shami) కి 4 వికెట్లు పడ్డాయి.
Innings Break!
Australia are all out for 263 in the first innings.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తర్వాత భారత బ్యాటర్లు బరిలో దిగారు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 రన్స్ చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(Rohit Sharma) 13 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 4 పరుగులు చేశారు. ఇద్దరూ వికెట్ పడకుండా నిదానంగా ఆడారు. కమిన్స్, మాధ్యూ కుహ్నెమన్, లయాన్ ఎంత ప్రయత్నించిన వికెట్ పడలేదు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు వెనకబడి ఉండగా రెండో రోజు తొలి సెషన్ రెండు జట్లకు కీలకం కానుంది.