»Siddaramaiah Came To The Assembly With A Flower In His Ear
Siddaramaiah : చెవిలో పూవ్వుతో అసెంబ్లీకి వచ్చిన సిద్ధరామయ్య
కర్ణాటక (Karnataka) సీఎం బసవరాజు బొమ్మై ప్రభుత్వనికి కాంగ్రెస్ (Congress) నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెవిల్లోకి పువ్వులతో కనిపించారు. మాజీ సీఎం విపక్ష నేత సిద్దరామయ్య (Siddaramaiah) తోపాటు మరికొంత ఎమ్మేల్యేలు చెవిలో పూలు పెట్టుకుని సభకు వచ్చారు.
కర్ణాటక (Karnataka) సీఎం బసవరాజు బొమ్మై ప్రభుత్వనికి కాంగ్రెస్ (Congress) నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెవిల్లోకి పువ్వులతో కనిపించారు. మాజీ సీఎం విపక్ష నేత సిద్దరామయ్య (Siddaramaiah) తోపాటు మరికొంత ఎమ్మేల్యేలు చెవిలో పూలు పెట్టుకుని సభకు వచ్చారు. మోసపూరిత హామీలు ఇచ్చి 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ( bjp ) ప్రభుత్వం.. ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని విమర్శగా వారు ఇలా చెవిలో పూలు( flowers ) పెట్టుకున్నారు. ఇక దీనితో పాటు శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం బడ్జెట్(Budget) ప్రవేశ పెట్టింది. చాలా కాలంగా కర్ణాటక ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తోంది కాంగ్రెస్. దొరికిన ఏ అవకాశాన్ని వదలకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి బొమ్మై ఈ విషయమై చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారంటే కాంగ్రెస్ నేతల ట్రోల్స్ ఏ రేంజులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఆర్థిక శాఖను(Finance Dpt ) తన వద్దే ఉంచుకున్న సీఎం బొమ్మై (CM Bommai) ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ప్రవేశ పెడుతుండగా కాంగ్రెస్ నేతలు ఇలా చెవిలో పూలతో కనిపించడం మరింత చర్చనీయాంశమైంది. ఇక బొమ్మై బడ్జెటును మోసపూరితమైందిగా కాంగ్రెస్ విమర్శించింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత బడ్జెట్లో ప్రకటించిన పనుల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేశారని సిద్దరామయ్య ఆరోపించారు. సగం పనులు కూడా పూర్తికాక ముందే 3లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఎందుకయ్యాయని బసవరాజ్ బొమ్మైని ప్రశ్నించారు. దీనిపై ఘాటుగా స్పందించిన బొమ్మై.. సిద్ధారామయ్య సీఎంగా ఉన్న సమయంలో కర్ణాటక చరిత్రలోనే ఎక్కువ అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు.బొమ్మై బడ్జెటును మోసపూరితమైందిగా కాంగ్రెస్ (Congress) విమర్శించింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.
Congress MLAs in Karnataka attended budget session with flower on their ears as a mark of protest.