పాకిస్థాన్లో గల కరాచీ పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆ ఆఫీసు షేర్షియా ఫైసల్ వద్ద ఉండగా.. సాయుధులు చొరబడి కాల్పులు ప్రారంభించారు. పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని జియో న్యూస్ రిపోర్ట్ తెలిపింది.
పాకిస్థాన్లో గల కరాచీ పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆ ఆఫీసు షేరియా ఫైసల్ వద్ద ఉన్న ఆఫీసులోకి సాయుధులు చొరబడి కాల్పులు ప్రారంభించారు. కడపటి సమాచారం అందేవరకు 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు ఆఫీసులో ఉన్నారని తెలిసింది. పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని జియో న్యూస్ రిపోర్ట్ తెలిపింది.
కరాచీ పోలీసులు, పాకిస్థాన్ రేంజర్లు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదుల వద్ద హ్యాండ్ గ్రనేడ్స్, ఆటోమెటిక్ గన్స్ ఉన్నాయని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనపై సింధు ముఖ్యమంత్రి మురాద్ అలీ షా సమీక్షిస్తున్నారు. సమీపంలో గల డీఐజీలు తమ సిబ్బందిని అక్కడికి పంపించాలని ఆదేశించారు. పోలీస్ చీఫ్ ఆఫీస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తామని, వదిలి పెట్టబోమని ఆయన హెచ్చరించారు.