కొన్ని కారణాల వల్ల భారతీయ రైల్వే (Railway) పలు రద్దు చేసింది. ట్రాకింగ్ ( Track) పనులు ఇతర మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు (cancellation) చేయడం, దారి మళ్లించడం లాంటిది చేస్తుంటుంది. 440 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
కొన్ని కారణాల వల్ల భారతీయ రైల్వే (Railway) పలు రద్దు చేసింది. ట్రాకింగ్ ( Track) పనులు ఇతర మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు (cancellation) చేయడం, దారి మళ్లించడం లాంటిది చేస్తుంటుంది. 440 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది. రైల్వేకు సంబంధించిన పనులు, భద్రత దృష్ట్యా మౌలిక సదుపాయాలలో మార్పులు ఉన్నాయి. రైల్వేలోని వివిధ జోన్లలో చేపడుతున్న నిర్వహణ పనులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం.. అక్టోబర్ 9 న నడుస్తున్న 131 రైళ్లలో 9 రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. అలాగే 59 పాక్షికంగా రద్దు చేయబడ్డాయి.
రద్దు చేయబడిన రైళ్లలో పూణే, (pune) కాన్పూర్, భటిండా, లక్నో, వారణాసి, ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుండి బయలుదేరే రైళ్లు ఉన్నాయి. మరో 58 రైళ్లను కుదించారు, 16 రైళ్లను రీషెడ్యూల్ చేశారు, మరో 51 రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులు రైళ్ల రీషెడ్యూల్, దారి మళ్లిన రైళ్ల వివరాలను రైల్వే వెబ్ సైట్లో చూడాలని రైల్వే శాఖ అధికారులు కోరారు. దర్భంగా, సీల్ధా, హౌరా, న్యూఢిల్లీ, భటిండా, ఆజంగంజ్, సికింద్రాబాద్, పటాన్ కోట్, భోపాల్, లక్నో, ప్రయాగరాజ్..శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా పలు రూట్లలో 440 రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.
కాగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు, కొన్నింటి ఆలస్యంగా నడిపినట్లు, కొన్ని రైళ్లను కుదించినట్లు రైల్వే పేర్కొంది. రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రైలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వాతావరణ (weather) మార్పు ప్రభావం, సాంకేతిక కారణాలు, రైలు ప్రమాదాలు కారణంగా ఇంత పెద్ద మొత్తంలో రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే శుక్రవారం ప్రకటించింది.63 రైళ్ల రూట్లను మార్చారు, మరో 58 రైళ్లను కుదించారు, 16 రైళ్లను రీషెడ్యూల్ చేశారు, మరో 51 రైళ్లను దారి మళ్లించారు. దర్భంగా, సీల్ధా, హౌరా, న్యూఢిల్లీ, భటిండా, ఆజంగంజ్, సికింద్రాబాద్, (Secunrabad) పటాన్ కోట్, భోపాల్, లక్నో, ప్రయాగరాజ్, హోషియార్ పూర్, జలంధర్, రాంనగర్, కోయంబత్తూర్, బిలాస్ పూర్, అహ్మదాబాద్ సెక్షన్లలోని 440 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే పేర్కొంది.
ఈ జాబితాలో మీ రైలు కూడా చేర్చబడితే, ప్రయాణించే ముందు, రైల్వే కాల్ సెంటర్ (Call center) నుండి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. మీ రైలు పూర్తిగా రద్దు చేయబడినా లేదా పాక్షికంగా అయినా రైల్వే నుండి సమాచారాన్ని పొందండి. దీనితో మీరు అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు.