క్రికెట్ (Cricket) అభిమనులకు శుభవార్త. ఐపీఎల్ (IPL) 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 12
పట్టణాల్లో జరగనున్నాయి. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. 70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది.
క్రికెట్ (Cricket) అభిమనులకు శుభవార్త. ఐపీఎల్ (IPL) 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 12పట్టణాల్లో జరగనున్నాయి. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. 70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్-2022లో (Hardik Pandya) నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans ) గెలుపొందిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1న డబుల్ డెక్కర్ మ్యాచ్ల్లో మొదటిగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రెండో మ్యాచ్లో ఢిల్లీతో లక్నో జట్టు పోటీ పడనుంది. ఈ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్లు ప్లేఆఫ్స్ షెడ్యూల్ను మరికొద్ది రోజుల్లో బీసీసీఐ (BCCI) ప్రకటించనుండగా.. ఐపీఎల్ 12వ సీజన్ తర్వాత తొలిసారిగా ఫ్రాంచైజీ జట్లు.. హోం, ఎవే స్టేడియాల్లో మ్యాచ్లు ఆడనున్నాయి.
ఇక ఈ టోర్నమెంట్లో 18 డబుల్ డెక్కర్( Double decker) మ్యాచ్లు ఉన్నాయి. ఇక గ్రూప్-ఏలో ముంబై, కోల్కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో జట్లు తలబడనుండగా.. గ్రూప్-బీలో చెన్నై, హైదరాబాద్, పంజాబ్, బెంగళూరు, గుజరాత్ పోటీ పడతాయి.ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు ఎంతో ప్రత్యేకం. గెలిచేది ఏ జట్టు అయినా అది తమ జట్టుగానే భావిస్తారు భారతీయులు. మొత్తం 10 జట్లు ఉన్నప్పటికీ ఒక్కో అభిమానికి ఒక్కో జట్టు ఫేవరెట్ గా ఉంటుంది. ఐపీఎల్ (IPL) ప్రారంభించినప్పటి నుంచి అన్ని సీజన్లూ సూపర్ హిట్ అయ్యాయి. కొత్త కుర్రాళ్లలో ప్రతిభను బయటకు తీయడానికి, వారిని ప్రోత్సహించడానికి కూడా ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది.