సీక్రెట్ బాక్సులో రాగి కంకులు పైన పెట్టి కింద గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 23 కిలోలలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ కొండాపూర్ పరిధిలో చోటుచేసుకుంది.
గంజాయి(Marijuana) అక్రమ రవాణాను అడ్డుకోవాలని పోలీసులు(police) ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా పలువురు దుండగులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సరికొత్త మార్గాల్లో గంజాయిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే మళ్లీ సరికొత్తగా రాగి కంకుల ప్యాకెట్లలో గంజాయిని తీసుకెళ్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ లోని హైటెక్ సిటీ(hi-tech city) పరిధిలోని కొండాపూర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వాహన తనిఖీల్లో భాగంగా దుండగులు కారులో సిక్రెట్ బాక్స్(secret box) ఉంచి అందులో పైన రాగి కంకులు పెట్టి కింద గంజాయి ప్యాకెట్లు దాచినట్లు డీసీపీ(DCP) శిల్పవల్లి పేర్కొన్నారు.
నిందితులు ఒడిశా డార్లి పుట్ నుంచి అరకు, విజయవాడ, హైదరాబాద్(hyderabad) మీదుగా ఉత్తర్ ప్రదేశ్(uttar pradesh) లోని మధుర(mathura)కు ఆ గంజాయిని తీసుకెళ్తున్నారని అధికారులు వెల్లడించారు. అరకు, ఒడిశాకు చెందిన రమేష్, తుంనాథ్ నుంచి వీరు గంజాయి(Marijuana) కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే వీరు కిలో గంజాయి రెండు వేల రూపాయలకు కొనుగోలు చేసి 15 వేల రూపాయలకు విక్రయించేందుకు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిందితుల వద్ద నుంచి 23.5 కిలోల గంజాయి, ఓ కారు(car) మూడు సెల్ ఫోన్ల(mobiles)ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు(officers) స్పష్టం చేశారు.
మరోవైపు గతంలో హైదరాబాద్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి(Marijuana) ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి దాదాపు 100 కేజీలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 32 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు జూమ్ కారు(car)లో కూడా గంజాయిని తీసుకెళ్తూ నలుగురు దొరికిపోయిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఇలా ప్రతి ఏటా అనేక సార్లు పలు రకాలుగా గంజాయిని తరలిస్తూ పోలీసులకు నిందితులు దొరికిపోతున్నారు. ఈ క్రమంలో వారిని గుర్తించడం కూడా పోలీసులకు సవాలుగా మారుతుంది.