Sharmila Padayatra : ముగింపు దశకు చేరుకున్న షర్మిల పాదయాత్ర…!
Sharmila Padayatra : వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. మరికొన్ని రోజుల్లో షర్మిల పాదయాత్ర ముగియనుంది. మార్చి 5న పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో ముగింపు సభను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. మరికొన్ని రోజుల్లో షర్మిల పాదయాత్ర ముగియనుంది. మార్చి 5న పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో ముగింపు సభను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏడాదిన్నర పాటు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తెలంగాణలో పలు ప్రాంతాల్లో సాగిన ప్రజా ప్రస్థానం త్వరలో ముగియనుంది. 4111KM మైలురాయి వద్ద పాదయాత్రను వైఎస్ షర్మిల ముగించనున్నారు. ఈ నెల 20న పాదయాత్రగా పాలేరు నియోజకవర్గంలో అడుగుపెడుతున్న షర్మిల అక్కడి నుంచి మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. చివరిగా పాలేరు చేరుకుంటారు. తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తాండా వద్ద పాలేరు నియోజక వర్గంలో అడుగు పెట్టనున్న షర్మిల ..14 రోజుల పాటు నియోజక వర్గంలో పాదయాత్ర కొనసాగనున్నారు.
2021 అక్టోబర్ 20న ప్రారంభం అయిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో కొనసాగింది. అనేక సమస్యలు ఎదురైనా షర్మిల వెనకడుగు వేయలేదు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని షర్మిల అనేక సందర్భాల్లో ప్రస్తావించారు.