HYD: నాంపల్లి స్టేషన్ వద్ద శిథిలావస్థకు చేరుకున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తొలగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ తెలిపారు. 5 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి రైల్వే యార్డ్ లైన్ల మీదుగా ఉండడంతో రైల్వే కార్యకలాపాలకు ఆటంకంగా మారిందని, దీంతో పాటు శిథిలావస్థకు చేరుకుందన్నారు. ఈనెల 20 నుంచి 23 వరకు కూల్చివేత పనులు కొనసాగించనున్నట్లు తెలిపారు.