ADB: ఉట్నూర్‌లోని ఐటీడీఎ కార్యాలయంలో గురువారం ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ జంగుబాయి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను జంగుబాయి దేవస్థాన కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈనెల 22న కెరమెరి మండలం దీపస్వరూప కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్నివిధాల ఏర్పాట్లు చేస్తామన్నారు.