»Actress Sapna Gill Arrested In Prithvi Shaw Attack Case
Prithvi Shaw: పృథ్వీ షాపై దాడి కేసులో నటి అరెస్ట్
ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవల దాడి జరిగిన ఘటనలో భోజ్‌పురి నటి సప్నా గిల్ అరెస్టయ్యారు. పృథ్వీ షాతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముంబయి తరఫున దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న భారత క్రికెటర్ పృథ్వీ షా(prithvi shaw)పై ఇటీవల దాడి జరిగిన ఘటనలో భోజ్‌పురి నటి సప్నా గిల్(sapna gill )అరెస్టయ్యారు(arrested). వివరాల్లోకి వెళితే ఇటీవల క్రికెటర్ పృథ్వీ షా తన స్నేహితుడితో కలిసి ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లారు. ఆ క్రమంలో పృథ్వీ షాతో ఫొటోలు దిగేందుకు పలువురు అభిమానలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో సెల్ఫీ తీసుకోవడానికి నిరాకరించాడు. అదే నేపథ్యంలో హోటల్ సిబ్బంది అభిమానులను అడ్డుకుని వెనక్కి నెట్టివేశారు. దీంతో వాగ్వాదంతో మొదలై గొడవకు దారి తీసింది. ఆ క్రమంలో వారు షా తన స్నేహితుడితో కారులో వెళుతున్న క్రమంలో వారి కారుపై అభిమానులు బుట్లతో దాడి చేశారు. దీంతో ఆవేదన చెందిన పృథ్వీషా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదే సమయంలో షా, అతని స్నేహితులు తనపై దాడి చేశారని ఓ యువతి పేర్కొంది. ఆమె భోజ్‌పురి నటి సప్నా గిల్ పృథ్వీ షా(prithvi shaw)తో అసభ్యంగా ప్రవర్తించినందుకు, ఆమె స్నేహితులతో కలిసి షా స్నేహితుడి కారుపై దాడి చేసినందుకు అరెస్టయ్యారని తెలిసింది. ఈ వ్యవహారంలో పోలీసులు గతంలో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. నిందితులు కారును ధ్వంసం చేసి, ఆపై విషయం తేల్చడానికి 50,000 రూపాయలు డిమాండ్ కూడా చేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో అభిమానుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(social media)లో వైరల్‌గా అవుతోంది.
కేవలం సెల్ఫీ తీసుకోవడానికే సప్నా క్రికెటర్ పృథ్వీ షా వద్దకు అభిమానిగా వెళ్లిందని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ లాయర్ పేర్కొన్నారు. లాయర్ తెలిపిన వివరాల ప్రకారం.. పృథ్వీ మద్యం తాగి సప్నాను కొట్టాడని ఆరోపించారు. ఇక ఇన్స్టాగ్రామ్(instagram)లో 2,19,000 మంది ఫాలోయింగ్ ఉన్న సప్నా, చండీగఢ్‌కు చెందిన వ్యక్తి కాగా… ప్రస్తుతం ముంబై(mumbai)లో ఉంటున్నారు. సప్నా గిల్ 2019 సంవత్సరంలో భోజ్‌పురి చిత్రం ‘కాశీ అమర్నాథ్’తో తన సినీ కెరీర్‌ని ప్రారంభించింది. ఈ చిత్రంలో సప్నాతో పాటు రవి కిషన్, ఆమ్రపాలి దూబే, నిర్హువా ప్రధాన పాత్రల్లో నటించారు.