'Hit and run' in Mumbai.. Son of Shiv Sena leader on the run.. Father arrested
Hit and run: ఇటీవలే పూణెలో ఓ బాలుడి హిట్ అండ్ రన్ కేసు జరిగింది. అది మరవక ముందే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ముంబైలో జరిగిన ఈ కేసులో అధికార పార్టీ నేత కుమారుడి హస్తం ఉంది. శివసేన నేత రాజేశ్ షా కుమారుడు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి బార్లో తాగాడు మిహిర్ షా. ఈ 24 ఏళ్ల కుర్రాడు ఆదివారం తెల్లవారుజామున ఓ రోడ్డు ప్రమాదం చేశాడు. తన మెర్సిడెస్ కారులో వేగంగా వెళ్తూ వోర్లిలో ఓ స్కూటర్‌ను ఢీ కొట్టాడు. దాంతో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న భార్యభర్తలిద్దరూ గాల్లో ఎగిరి పడ్డారు. ఈ ఘటనలో 45 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. వెంటనే మిహిర్ షా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా పదవ తరగతి వరకే చదివాడు. ఆపై చదువు మానేసి పార్టీ పనుల్లో పాల్గొనేవాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ సమయంలో మిహిర్ తాగి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే కేసు దర్యాప్తులో పబ్ యజమాని మాత్రం మిహిర్ తాగలేదని, రెడ్‌బుల్ మాత్రమే తీసుకున్నాడని చెబుతున్నాడు. రాత్రంతా బారులోనే స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన మిహిర్ బెంజ్‌కారులో వెళ్లిన దృశ్యాలు సీసీలో రికార్డు అయ్యాయి. తరువాత రోడ్డు మీద ప్రమాదం జరిగిన తరువాత మిహిర్ పరారయ్యాడు. ఈ విషయంలో మిహిర్ తండ్రి రాజేశ్, కారు డ్రైవర్ రాజ్‌రిషి బిదావత్‌ను ప్రశ్నించారు. తరువాత వారిద్దిరిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిహిర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.