straydogs bite:వీధికుక్కల స్వైరవిహరం.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్
straydogs bite:వీధి కుక్కలు (straydogs) స్వైరవిహరం చేస్తున్నాయి. అంబర్ పేట (amberpet) ఘటనతో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంబర్ పేట తర్వాత చైత్యనపురి.. అటు నుంచి కరీంనగర్లో (karimnagar) కూడా స్ట్రీట్ డాగ్స్ రెచ్చిపోయాయి. వరస ఘటనలతో కుక్కల బెడదపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వీధి కుక్కల నియంత్రణపై చర్యలేవి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
straydogs bite:వీధి కుక్కలు (straydogs) స్వైరవిహరం చేస్తున్నాయి. అంబర్ పేట (amberpet) ఘటనతో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంబర్ పేట తర్వాత చైత్యనపురి.. అటు నుంచి కరీంనగర్లో (karimnagar) కూడా స్ట్రీట్ డాగ్స్ రెచ్చిపోయాయి. వరస ఘటనలతో కుక్కల బెడదపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వీధి కుక్కల నియంత్రణపై చర్యలేవి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రోడ్ల మీదకొచ్చి పిల్లలను చంపితే జంతు ప్రేమికులు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. కుక్కల (dogs) బెడదపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అప్పటికప్పుడు.. తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం కాదని అంటున్నారు.
ట్రెండింగ్
కుక్కల దాడి #straydogs హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. అంబర్ పేట (amberpet) ఘటన బాధాకరం అంటున్నారు. చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. కుక్కలను నియంత్రించాలని ముక్త కంఠంతో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటు అంబర్ పేటలో ప్రదీప్‌పై (pradeep) దాడి చేసిన కుక్కలను గ్రేటర్ వెటర్నరీ విభాగం సిబ్బంది పట్టుకున్నారు. ఛే నంబర్, గోల్నాక (golnaka), శంకర్ నగర్ (shankar nagar) ప్రాంతాల్లో వెతికి మరీ పట్టుకున్నారు. వాటితోపాటు 33 కుక్కలను పట్టుకుని కూకట్ పల్లిలో గల మహాదేవ్ పూర్లో ఉన్న డాగ్ కేర్ సెంటర్‌కు తరలించారు.
రోజు 300 మందికి కుక్కకాటు
గ్రేటర్ పరిధిలో రోజుకు 300 మందికి (300) పైగా కుక్కకాటుకు గురవుతారని తెలిసింది. కొత్తపేట (kothapeta) మారుతినగర్ రోడ్ నంబర్ 19లో రిషి అనే బాలుడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. ఈ నెల 8వ తేదీన కొంపల్లిలో ఆరేళ్ల చిన్నారి రమ్య (ramya), 15వ తేదీన భార్గవి (bhargavi), గత నెల 11వ తేదీన తను శ్రీపై కుక్కల దాడి చేశాయి. హైదరాబాద్ జిల్లాలో 2017 నుంచి ఇప్పటివరకు 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్- మల్కాజిగిరిలో 6 వేలు, రంగారెడ్డిలో 25 వేలు, వికారాబాద్‌లో 20 వేల కేసులు ఉన్నాయి. తనను కుక్క కరిచిందని గతంలో హైకోర్టు జడ్జీ ఒకరు చెప్పడంతో కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ పరిధిలో 5.75 లక్షల కుక్కలు ఉన్నాయని మేయర్ చెబుతున్నారు.
పొట్టకూటి కోసం వచ్చి
అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కుక్కల బారి నుంచి తప్పించుకోవడానికి శక్తి మేర ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. కుక్కలన్నీ కలిసి ఆ చిన్నారిని దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ (gangadhar) నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. అంబర్ పేట ‘చే నెంబర్’ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్లో వాచ్ మెన్‌గా (watchmen) పని చేస్తున్నాడు. భార్య, కూతురు, కుమారుడు కలిసి అంబర్ పేట ఎరుకుల బస్తీలో ఉంటున్నాడు. గంగాధర్ ఇద్దరు పిల్లలను ఆదివారం వెంట బెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్‌కు (service centre) వెళ్లాడు. కుమార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్లో ఉంచి, కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. అతను అక్కడ ఆడుకుంటూ ఉండటంతో మరో వాచ్ మెన్‌తో కలిసి పని మీద బయటికి వచ్చాడు. కాసేపు అక్కడే ఆడుకున్నాడు. ఆ తర్వాత అక్క (sister) కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో వీధి కుక్కలు వెంటపడ్డాయి. దాడి చేసి, ఆ చిన్నారిని చిదిమేశాయి. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కలచివేశాయి.