ప్రస్తుతం థియేటర్లో దూసుకుపోతోంది యానిమల్ మూవీ. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. రష్మిక కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేసింది మరో బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది హాట్ బ్యూటీ తృప్తి డిమ్రీ.
Animal: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ‘యానిమల్’ (Animal) సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. సినిమాలో రష్మికతోపాటు.. మరో హాట్ బ్యూటీ తృప్తి డిమ్రీ కీలక పాత్రలో నటించింది. యానిమల్ సినిమా చూసిన వారంత ఈ బ్యూటీని అంత ఈజీగా మరిచిపోలేకపోతున్నట్టుగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
హీరోయిన్ రష్మిక (Rashmika) కంటే తృప్రి డిమ్రీ గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది. బ్యూటీని చూస్తే కుర్రాళ్ల మతి పోవడం గ్యారెంటీ. యానిమల్ (Animal) సినిమాలో అమ్మడు బోల్డ్‌గా రెచ్చిపోయింది. థియేటర్ నుంచి బయటికొచ్చాక ఈ బ్యూటీ మైండ్ నుంచి పోవడం లేదని కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరు ఈ బ్యూటీ? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ 2017లో ‘పోస్టర్ బాయ్స్’ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2018లో రొమాంటిక్ మూవీ ‘లైలా మజ్ను’లో లైలా పాత్రలో నటించింది.
2020లో హారర్ థ్రిల్లర్ ‘బుల్బుల్’ల్తో ఓటీటీ స్టార్‌గా మారిపోయింది. అయినప్పటికీ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు యానిమల్ సినిమాతో తెగ పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో తృప్తి డిమ్రీ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. అమ్మడికి అందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. నిమల్ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మికను సైతం పక్కకు పెట్టేసింది అమ్మడు. మరి తెలుగులో తృప్తికి ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.