Salaar: 24 గంటలు గడవకముందే సంచలనాలు సృష్టిస్తోన్న సలార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ట్రైలర్ ఆలస్యంగా వచ్చినా రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. వారి ఆలోచనకు తగ్గట్లే ట్రైలర్ సంచలన రికార్డు సృష్టిస్తోంది.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ట్రైలర్ ఆలస్యంగా వచ్చినా రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. వారి ఆలోచనకు తగ్గట్లే ట్రైలర్ సంచలన రికార్డు సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 2 ట్రైలర్ ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసింది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 106 మిలియన్ వ్యూస్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ రికార్డును మరే సినిమా ట్రైలర్ ఇప్పటి వరకు టచ్ చేయలేదు. కేజిఎఫ్2 తర్వాత రెండో స్థానంలో 74 మిలియన్ వ్యూస్‌తో ఆదిపురుష్ ఉంది. లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ మూవీ ట్రైలర్ 71 మిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో ఉంది. అయితే.. సలార్ ట్రైలర్ ఈ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. 16 గంటల్లోనే సలార్ ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 75 మిలియన్ వ్యూస్ సాధించింది. 18 గంటల్లో 100మిలియన్ వ్యూస్ సాధించింది.
దీంతో ఇప్పటి వరకు ఉన్న డిజిటల్ రికార్డులన్నీ సలార్ గాలికి కొట్టుకుపోయాయి. ఇదే కాదు.. టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ మార్క్‌ను టచ్ చేసిన రికార్డ్ కూడా సలార్ సినిమా సొంతం చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైలర్ 7 గంటల 43 నిమిషాలకు 1 మిలియన్ లైక్స్ మార్కును అందుకుంది. సలార్ ట్రైలర్ 6 గంటల 04 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ రికార్డును బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. దీంతో సలార్ కలెక్షన్ల పరంగా కూడా సంచలనం సృష్టించడం గ్యారెంటీ అంటున్నారు. కేజీఫ్ చాప్టర్ 2, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు 1200 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ రికార్డులను కూడా సలార్ బద్దలు కొట్టడం ఖాయమని తెలుస్తోంది.