సలార్ రిలీజ్ టైం దగ్గర పడుతోంది. డిసెంబర్ 22న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం ఓ న్యూస్ షాకింగ్‌గా మారింది.
సలార్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడి నుంచే సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుంది కాబట్టి.. ప్రమోషన్స్ మరింత స్పీడప్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. రేపో మాపో పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్‌కు రెడీ అవుతున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసేలా ఉంది. సలార్ ప్రమోషన్స్‌లో ప్రభాస్ పాల్గొనే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
ఆదిపురుష్ సినిమా రిలీజ్ సమయంలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రమే పాల్గొన్నాడు ప్రభాస్. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళిపోయాడు.. సినిమా రిలీజ్ అయ్యాక ఎప్పుడో ఇండియా తిరిగి వచ్చాడు. ఇక ఇప్పుడు సలార్ ప్రమోషన్స్ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవనుందని సమాచారం. అసలు.. ప్రభాస్ సలార్ కోసం ఎలాంటి ఈవెంట్స్‌లో పాల్గొనడం కానీ, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ చేయబోవడం లేదట.
కాకపోతే ఒకటి రెండు ఈవెంట్స్‌లో కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లల్లో కనిపించడని టాక్. ఇదే కనుక నిజమైతే సలార్‌కు రావాల్సిన హైప్ తగ్గే ఛాన్స్ ఉంది. కానీ రామోజీ ఫిలిం సిటీలో సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సలార్ ప్రమోషనల్ టూర్ పై క్లారిటీ రానుంది. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.