BHNG: మర్రిగూడ మండలం రాజపేట తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉచిత దంత వైద్య శిబిరం, మాజీ సర్పంచ్ మారగోని వెంకటయ్య యాదవ్ సమక్షంలో ఆదివారం నిర్వహించారు. నల్లగొండ అద్విక్ దంత వైద్యశాల సౌజన్యంతో డాక్టర్ యామా అజయ్ కుమార్, వైష్ణవి ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరమును నిర్వహించారు. గ్రామంలోని రోగులను పిప్పి, గార, పాచి, ఎత్తు, వంకర పళ్ళు వ్యాధులను పరిశీలించారు.