NZB: ఆర్మూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎందరో వీరనారీలకు, ఉన్నతాధికారులకు జన్మనిచ్చిందని మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ కొనియాడారు. సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పాఠశాల ఆవరణలో 36వ వారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించి చెత్తాచెదారాన్ని తరలించారు.