NDL: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేశామని చెప్పడంతో రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు తెలంగాణకు మేలు చేసే విధంగా పాలని చేస్తున్నారని ఆయన తెలిపారు.