తెలంగాణలోని డ్వాక్రా సంఘాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీనిధి రుణాలు తీసుకుని చెల్లించని వారిపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయంచింది. ఈ చట్టం ప్రకారం.. బకాయిలు చెల్లించని వారి ఆస్తులను జప్తు చేసి బహిరంగంగా వేలం వేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఒకవేళ రుణం తీసుకున్న సభ్యురాలికి ఆస్తులు లేకపోతే ఆ బాధ్యత మొత్తం గ్రూప్ సభ్యులపై పడుతుంది.