KRNL: కర్నూలు మున్సిపల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్-2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. సంఘం సభ్యుల సేవలను అభినందించిన ఆయన, కాంట్రాక్టర్ల సంక్షేమానికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు.