బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’పై దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించాడు. ‘ధురంధర్ ఒక అద్భుతం. అయితే ఈ సినిమాలో రెండు చోట్ల నాకు ఇబ్బందిగా అనిపించింది. ఒకటి మాధవన్ చెప్పే ‘దేశం గురించి ఆలోచించే రోజు వస్తుంది’ అనే డైలాగ్.. రణ్వీర్ సింగ్ చెప్పే ‘ఇది నవ భారతం’ అనే డైలాగ్. ఈ రెండు ఒక పార్టీకి చెందిన ప్రచార ధోరణిలో ఉన్నాయని నా అభిప్రాయం’ అని పేర్కొన్నాడు.