KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉల్లిమెల్ల గ్రామ సమీపంలోని జూద స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడులు చేశారు. ఈ దాడులలో పోలీసులు జూదం ఆడుతున్న వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వీడియోలు తీసి పోలీస్ స్టేషన్కు రావాలని ఆదేశించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జూదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాటిని అరికట్టాలని పలువురు కోరుతున్నారు.