NRML: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో బాగా చదువుకోవాలని ఖానాపూర్ ఎంపీడీవో రమాకాంత్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ మండలంలోని బీర్నంది జడ్పీ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ప్రాక్టీస్ బుక్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో MPO రత్నాకర్, ఎస్సై రాహుల్ గైక్వాడ్, సర్పంచులు నవీన్ యాదవ్, పెట్టాం రాధా, పాఠశాల HM వర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.