ASF: రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామం ఎస్సీ కాలనీ అంగన్వాడీ–2 సెంటర్లో జరిగిన సమావేశానికి సూపర్వైజర్ విజయ, గ్రామ సర్పంచ్ రవీందర్ హాజరయ్యారు. అంగన్వాడీ సేవలను అర్హులందరూ వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం 11 మంది సభ్యులతో ఆరోగ్య లక్ష్మి కమిటీని నియమించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జగదీష్, సెక్రటరీ శాంతయ్య, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్ శోభ పాల్గొన్నారు.