ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో (WPL) ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు సీజన్లలోనూ ఫైనల్కు వెళ్లినా కప్పు కొట్టలేదు. గత సీజన్ వరకు కెప్టెన్గా ఉన్న మెగ్ లానింగ్ యూపీ జట్టుకు వెళ్లిపోవడంతో భారత స్టార్ జెమీమా రోడ్రిగ్స్ ఢిల్లీ పగ్గాలు అందుకుంది. మరి ఆమె జట్టు రాత మారుస్తుందో లేదో చూడాలి. కెప్టెన్సీలో అనుభవం ఉన్న లారా వోల్వార్ట్ జట్టులో ఉండడం జెమీమాకు కలిసొచ్చే అంశం.