MNCL: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 11న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్ నల్ల శంకర్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సినిమా వాడ, అశోక్ రోడ్, కట్ట పోచమ్మ ఆలయం వద్ద పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.