NGKL: గ్రామ అభివృద్ధిలో గ్రామ సర్పంచ్దే కీలక పాత్ర అని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అన్నారు. కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామ సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఎంపీని మంగళవారం కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఆశాదీప్ రెడ్డిని అభినందించారు.